దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బధిరులకు పరికరాలు పంపిణీ

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:05 AM
 

  కర్నూలు, సూర్యప్రతినిధి : జిల్లాలోని మంత్రాలయం, కోడుమూరు నియోజ వర్గాల్లోగల దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బధిరులకు ఆయా పరికరాలను శుక్రవారం పంపిణీ చేశారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు, ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తదితరులు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ రేణుక మాట్లాడుతూ దివ్యాంగులు మానసికంగా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల న్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను కూడా ఉపయోగించు కోవాలన్నారు.