రేషన్‌ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు తప్పని సరికాదు

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:04 AM
 

  గుంటూరు, సూర్యప్రతినిధి :  చౌకధరల దుకాణంలో నగదు రహిత లావా దేవీలు తప్పనిసరి కాదని మంత్రి పుల్లారావు తెలిపారు.శుక్రవారం మంత్రి పుల్లా రావు మాట్లాడుతూ కార్డుదారులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని మంత్రి  హెచ్చరించారు. డీలర్లపై ఒత్తిడి తెచ్చే అధికారులపై కూడా చర్యలు తీసు కుంటామని మంత్రి పుల్లారావు స్పష్టం చేశారు. జూన్‌లో బుగ్గవాగు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తు న్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు పర్యటనపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని పుల్లారావు విమర్శించారు.