సిపిసిఎస్‌ను రద్దుచేసి ఉద్యోగులను ఆదుకోండి

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:03 AM
 

సిపిఎస్‌ఇటిఎ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఆర్‌. నాయుడు   


మేజర్‌న్యూస్‌, చంద్రగిరి : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కాంట్రీబ్యూటరీ పెన్షన్‌     స్కీంను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని సిపిఎస్‌ఇటిఎ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఆర్‌.నాయుడు అన్నారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసేందుకు చంద్రగిరి ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులచే పోస్టల్‌ కార్డులు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి రాశారు. ఈ సందర్భంగా పి.వి.ఆర్‌. నాయుడు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి సిపిఎస్‌ను రద్దు చేస్తే మేలు జరుగుతుందన్నారు. 2004 సెప్టెంబరు 1వ తేది రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించిందని, దీని ద్వారా సెప్టెంబర్‌ 1, 2004 నుంచి ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు పెన్షన్‌ను పొంద లేక పోతున్నారన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రయత్నిం చాలన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేంగా పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకోవా లని కోరారు. జిల్లా అధ్యక్షుడు రేణిగుంద దేవానంద్‌ మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉద్యోగులు చేస్తున్న నిరసనలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. రాష్ట్రంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి వచ్చి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేటట్లు సాధించుకోవాలన్నారు. చంద్రగిరి సిపిఎస్‌ఇటిఎ అధ్యక్షుడిగా తిరుపతి చెంచు భానుప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం లో ఎపిపిఇటిఎ, యుటిఎఫ్‌, ఎస్‌టియు అన్ని సంఘాల ఉద్యోగులు కేశవులు, హరిక్రిష్ణ, శ్రీనివాసులు, కిరణ్‌, గాంధీ, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.