కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం ముగతి గ్రామం నందు గ్రామ నడిబొడ్డున ఉన్న గ్రామ చవిడి దగ్గర సుమారు 40 అడుగుల మేర స్వరంగం బయటపడింది. ఆ స్వరంగం దాదాపు మూడు తరాల క్రితందై ఉండొచ్చని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ స్వరంగం లో ఏమి ఉందొ అని చూడటానికి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తుండడంతో ఆ ప్రాంతం అంత పర్యాటక వాతావరణాన్నితలపిస్తోంది. ఈ స్వరంగం సమాచారం అందుకున్న పోలీసులు సిఐ మహేశ్వరరెడ్డి, ఎసై వేణుగోపాల్ రాజ్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సొరంగాన్ని పరిశీలించారు. దీని పై పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందిస్తామన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa