ఇంటర్నెట్‌లో ఎంపీ శశికళ అశ్లీల ఫోటోలు

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 01:55 AM
 

న్యూఢిల్లీ : అన్నా డీఎంకే బిహష్కృత ఎంపీ శశికళ పుష్ప ఆశ్లీల ఫోటోలు, పోస్టులు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో, తన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ తనను టార్గెట్‌ చేస్తున్నారని, తన పరువు పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఏడీ ఎంకేకు చెందినవారే ఈ దారుణానికి ఒడిగడు తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం  కింద కేసు నమోదు చేశామని, సైబర్‌ సెల్‌ దీనిపై దర్యాప్తు చేస్తుందని క్రైమ్‌ విభాగం డీసీపీ తెలిపారు. మరో వైపు, శశికళ పుష్పను పార్టీ నుంచి జయలలిత బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో శశికళను సస్పెండ్‌ చేశారు.