మొదట తాను ఇంటికి రాగానే ఎవరో కొత్త వ్యక్తి

  Written by : Suryaa Desk Updated: Fri, May 19, 2017, 07:38 PM
 

న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్‌ క్లీన్ షేవ్‌తో పాటు జుట్టును విభిన్నంగా కట్ చేయించుకున్నాడు. అయితే ఈ  కొత్త అవతారం అతని కాబోయే భార్య సాగరిక ఘట్గేకు తెగ నచ్చేసింది. కొత్త లుక్‌తో ఉన్న జహీర్ పక్కన నిలబడి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టి తన సంతోషాన్ని పంచుకుంది. మొదట తాను ఇంటికి రాగానే ఎవరో కొత్త వ్యక్తి కనిపించాడని చెప్పింది. అయితే జహీర్ తన గడ్డాన్ని బాగా షేవ్ చేసుకున్నాడని, హెయిర్‌లుక్ బాగుందని చెప్పింది. వీరిరువురు చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఏప్రిల్ 24వ తేదీన జహీర్ ఖాన్ ట్విట్టర్‌లో సాగరికాతో తన ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించాడు. ఐపిఎల్ పదో సీజన్ ముగిసిన తర్వాత ఈ జంట పెళ్లి గురించి మాట్లాడే అవకాశముంది.