వంశధార నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: జగన్‌

  Written by : Suryaa Desk Updated: Fri, May 19, 2017, 07:33 PM
 

శ్రీకాకుళం: వంశధార నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా హిర మండలం వంశధార ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన వైసీపీ బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. వంశధార స్టేజ్‌-2 ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబుకు రైతులకంటే కాంట్రాక్టర్లపైనే ప్రేమ ఎక్కువగా ఉందని తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ హయాంలోనే వంశధార పనులు 90 శాతానికి పైగా పూర్తి చేస్తే.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాలయాపన చేస్తున్నారన్నారు. చంద్రబాబు బినామి సీఎం రమేష్‌కు కాంట్రాక్టు పనులు అప్పగించారన్నారు. కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారన్నారు.