బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య‌రాయ్ కేన్స్‌లో త‌ళుక్కుమ‌న్న‌ది

  Written by : Suryaa Desk Updated: Fri, May 19, 2017, 06:05 PM
 

కేన్స్: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య‌రాయ్ కేన్స్‌లో త‌ళుక్కుమ‌న్న‌ది. ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో 15 ఏళ్లుగా అందాలు ఆరబోస్తున్న ఈ భామ ఇప్పుడు కొత్త ఉత్సాహాంతో క‌నిపించింది. పెద్ద పెద్ద ఈవెంట్ల‌లో చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ద‌ర్శ‌న‌మిచ్చే ఐశ్వ‌ర్య ఈసారి కూడా ల‌వ్లీ లుక్‌తో ప్రిపేరైంది. ఐశ్వ‌ర్య కేన్స్ కోసం ఒలివ్ గ్రీన్ గౌన్‌లో స్ట‌న్నింగ్‌గా త‌యారైంది. ఫెస్టివ‌ల్ కోసం కూతురు ఆరాధ్య‌తో వెళ్లిన క్యూటీ లేడీ రెడ్‌కార్పెట్ కోసం రెఢీ అవుతున్న‌ది. ఫెస్టివ‌ల్ మొద‌టి రెండు రోజుల్లోనూ బాలీవుడ్ బేబీ దీపికా ధ‌గ‌ధ‌గ మెరిసిన విష‌యం తెలిసిందే.