ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపీ విధులకు పక్కాగా డుమ్మా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 18, 2017, 02:49 AM

(అనంతపురం- సూర్య ప్రత్యేక ప్రతినిధి) : చల్లని సేవలు అందుతాయనే ఆశ.. కొండంత నమ్మకంతో పదుల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న రోగులకు నిరాశ ఎదురవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వ్కెద్యమే నయం అనే భావన రోగుల్లో కలుగుతోంది. పెద్ద వ్కెద్యులు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే హౌస్‌ సర్జన్ల చికిత్సతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందన్న వ్యధ మిగులుతోంది. పేరుకే పెద్దాస్పత్రి. దీనిని సర్వజన ఆస్పత్రిగా కూడా పిలుస్తున్నాం. అనేక బయట రోగులు (ఓపీ) విభాగాలలో సీనియర్‌ వ్కెద్యులు డుమ్మా కొడుతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. రోజూ ఇక్కడి ఓపీ విభాగాలకు రమారమి 1,600 మంది రోగులు వస్తున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ నుంచి సిఫార్సు కేసులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ్కెతే ప్రత్యేక వ్కెద్యులు ఉంటారనే ఉద్దేశంతోనే దీరెకాలిక రోగాలతో వస్తున్నారు. బయోమెట్రిక్‌ విధానం, 72 సీసీ కెమెరాలు కేవలం చెప్పుకోడానికే ఉన్నాయిక్కడక. ఎవరు ఎన్ని గంటలకు వస్తున్నారు. ఎన్ని గంటలకు వెళ్తున్నారు. ఓపీల్లో సేవల పరిస్థితి ఏంటి. వంటి కనీస వివరాలను కూడా ఆరా తీయలేని దుస్థితి. గతంలో కంటే ఇపుడు వ్కెద్యుల సంఖ్య, అధికారుల పోస్టుల్లో బాగానే ఉన్నారు. అయినా ఆస్పత్రి ఓపీ మ్త్రాం గాడిలో పడటం లేదు. ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా సాగుతోంది. జిల్లాకే ఏకైక పెద్దాస్పత్రి ఉందన్న మాటేకానీ మెరుగైన, ప్రత్యేక వ్కెద్యం అందని ద్రాక్షగా మారుతోంది. అనేక అధునాతన వసతులు, వ్కెద్య పరికరాలు ఒనగూరాయి. వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయలేని దారుణమిది.


ఆలస్యంగా వస్తారు త్వరగా వెళ్తారు


ఇక్కడ ఆస్పత్రి ఓపీ విభాగాలు 23 ఉన్నాయి. వీటిలో మెడిసిన్‌, సర్జరీ, గైనిక్‌, చిన్నపిల్లలు, ఆర్థో, దంత, ఛాతీ-క్షయ, మానసిక వంటి విభాగాలు ఎంతో కీలకం. కొంత మంది వ్కెద్యులు నిర్దేశిత వేళకు వస్తున్నారు. సకాలంలో రోగులకు సేవలు అందిస్తున్నారు. సింహభాగం వ్కెద్యులు ఆలస్యంగా వస్తున్నారు. ముందుగానే వెళ్లిపోతున్నారు. ఇది ఇక్కడి ఆస్పత్రిలో షరామామూలే అన్నట్లుగా తయారైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఓపీ సాగాలి. దీనిని ఒంటి గంట దాకా పొడిగించారు. కానీ ఈ వేళలు ఎక్కడా అమలు కాలేదు. ఉదయం 10 గంటలకు వచ్చే వ్కెద్యులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే నేరుగా సొంత క్లినిక్‌, నర్శింగ్‌ హోమ్‌లకు వెళ్లిపోతున్నారు. అధిక శాతం వ్కెద్యులు వేళలను పాటించడం లేదు. ఆస్పత్రి అధికారులు ఏనాడూ ఓపీలను చూడలేదు. అందుకే వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సీనియర్‌ వ్కెద్యులు దగ్గరుండి హౌస్‌ సర్జన్లకు తరీాేదు ఇవ్వాలి. కానీ ఇదేదీ ఉండదు. నేర్చుకున్న అరకొర చదువుతోనే రోగులపై ప్రయోగాలు చేస్తున్నారు.


కాఫీ బార్‌ కిటకిట


ఎంత దయనీయం అంటే ఓపీకి వచ్చి ఓ గంట విధులు నిర్వర్తించి నేరుగా కాఫీ బార్‌కు వెళ్తున్నారు. ఆస్పత్రి పరిపాలన విభాగంలోనే ఈ కాఫీబార్‌ ఉంది. ఇక్కడ అన్ని రకాల దినపత్రికలు, టీవీ.. వంటి సౌకర్యాలు ఉన్నాయి. కొంత మంది జూనియర్లపై భారం మోపి ఎంచక్కా కాఫీ బార్‌లోనే అధిక సమయం గడుపుతున్నారు. అత్యంత దయనీయం ఏమంటే ఏకంగా ఓ ముగ్గురు ఫ్రొఫెసర్లు ఎక్కువ సమయం ఇక్కడే ఉంటున్నారు. ఉదయం 11 గంటల నుంచే కాఫీబార్‌ కిటకిటలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల దాకా కాఫీబార్‌ తలుపులు తీయొద్దని గత కలెక్టర్‌ ఆదేశించారు. ఇది ఆచరణకు నోచుకోలేదు. ప్రతి నెలా బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించాలి. ఆలస్యంగా వస్తున్నారన్న విషయం తెలిసిపోతుంది. దీన్ని సమీక్షించి నిర్దేశిత వ్కెద్య సిబ్బందికి మెమోలు కూడా ఇవ్వవచ్చు. ఇప్పటి దాకా ఈ ప్రక్రియ అసలు అమలు కాలేదు. ఇక డాక్టర్‌ చూసిన తర్వాత వ్యాధి నిర్ధరణకు వెళ్లాలి. అక్కడ కూడా అదే దుస్థితి. ఒకరు ఉంటే... మరొకరు ఉండరు. ఇక్కడ కూడా రోగులు కాసుకోవాల్సిందే. ఎక్స్‌రే తీయించుకుంటే మరుసటి రోజు రావాల్సిందే.


ప్రత్యేక నిఘా ఉంచుతాం: డాక్టర్‌ జగన్నాథ్‌, పర్యవేక్షకుడు, సర్వజన ఆస్పత్రి ఓపీలో విధులు నిర్వర్తించాల్సిన వ్కెద్యులు కచ్చితంగా వేళలు పాటించాల్సిందే. సమయపాలన కోసమే బయోమెట్రిక్‌ విధానం తెచ్చాం. ఇక నుంచి విధిగా బయోమెట్రిక్‌ హాజరు సమీక్షిస్తాం. దీంతోపాటు వ్కెద్యులు ఎవరు వస్తున్నారు.. వెళ్తున్నారో కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తాం. కాఫీ బార్‌ కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెరిచేలా నిర్వాహకులను ఆదేశిస్తాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com