ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి మరో డబుల్‌ డెక్కర్‌ రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 18, 2017, 02:34 AM

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ః విశాఖకు కొత్త రైళ్లు రానున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించిన రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఆర్థిక రాజధానిగా రూపొందుతున్న విశాఖకు రైల్వే శాఖ ప్రాధాన్యం కల్పిస్తూ విజయవాడ, కృష్ణరాజపురం, హౌరా, యశ్వంత్‌పూర్‌, చెన్నై, కామాఖ్య, భువనే శ్వర్‌లకు రాకపోకలు సాగించే విధంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. అలాగే సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఏసీ కోచ్‌లతో నడుస్తున్న ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు నాన్‌ ఏసీ కోచ్‌లను జత చేయనున్నది. రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రాంచి అధికారులతో జరిపిన సమీక్షలో పలు అంశాలతోపాటు కొత్త రైళ్లపై చర్చించినట్టు తెలిసింది. దీంతో ఇటీవల బడ్జెట్‌లో ఆంధ్రాకు కేటాయించిన కొత్త రైళ్లు మరికొద్ది రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో విశాఖ-విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఒరిజినేటింగ్‌ రైలు కాగా విశాఖ మీదుగా భువనేశ్వర్‌-కృష్ణరాజపురం, హౌరా-యశ్వంత్‌పూర్‌, కామాఖ్య-బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే విధంగా హంసఫర్‌ రైళ్లను పట్టాలెక్కించనున్నారు. అలాగే వయా విశాఖ మీదు గా సంత్రాగచ్చి-చెనై్న మధ్య అంత్యోదయ రైలును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


డబుల్‌ డెక్కర్‌


రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగించే విధంగా విశాఖ నుంచి విజయవాడ మధ్య ఓవర్‌నైట్‌ రైలు లేదా ఇంటర్‌సిటీ ప్రవేశపెట్టాలని చేసిన డిమాండ్‌ మేరకు డబుల్‌ డెక్కర్‌ రైలు అందుబాటులోకి రానుంది. కాగా ఈ ఏడాది జనవరి ఒక టో తేదీ నుంచి విశాఖ-తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన డబుల్‌ డెక్కర్‌ రైలు వారా నికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో వుంటోంది. అయితే విశాఖ, విజయవాడ మధ్య ప్రవేశపెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ను ప్రతిరోజూ నడిపిస్తారా, లేక వారానికి రెండు లేక మూడు రోజులు మాత్రమే అందుబాటులో వుండే విధ ంగా ప్రవేశపెడతారా అనేది స్పష్టం కావాల్సి వుంది.


హంసఫర్‌ రైళ్లు


కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన రైళ్లలో హౌరా-యశ్వంత్‌పూర్‌ హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ ఏడాది జనవరి 20వ తేదీన ప్రవేశపెట్టారు. 22887/88 నంబర్లతో వారాంతపు రైలుగా 16 థర్డ్‌ ఏసీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రవేశపెడతామని చెబుతున్న హౌ రా-యశ్వంత్‌పూర్‌ హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇదేనా లేక మరో కొత్త రైలా అన్న ది స్పష్టం కావాల్సి వుంది. ఇక కామాఖ్య-బెంగళూరు హంసఫర్‌ వారాంతపు రైలును 12504/03 నంబర్లతో ప్రవేశపెట్టారు. కొద్దిరోజుల తర్వాత ఈ రైళ్లకు శ్రీకాకుళం, పలాసలో హాల్డ్‌ కల్పించారు. ఈ రైలుపై కూడా స్పష్టత కొరవడింది. కాగా వయా విశాఖ మీదుగా భువనేశ్వర్‌-కృష్ణరాజపురం మధ్య ప్రత్యేక సువిధ రైలుగా నడిపిన రైలును శాశ్వత ప్రాతిపదికన పట్టాలెక్కించే విధంగా పచ్చ జెండా ఊపనున్నారని తెలుస్తోంది.


ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు నాన్‌ ఏసీ కోచ్‌లు


విశాఖ-న్యూఢిల్లీ మధ్య ప్రతిరోజూ నడుస్తున్న ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేయనున్నారు. అన్ని ఏసీ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లకు నాన్‌ ఏసీ కోచ్‌లను జత చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యంలో సామాన్య ప్రయాణికునికి కాస్త ఊరట కలగనుంది.  గుంటూరుగుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడి న రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం ఆమోదం తెలి పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 3,631 కోట్ల అంచనా వ్యయంతో 401.47 కి.మీ. మేర రైల్వే లైనును నిర్మించనున్నారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. రాజధాని నుంచి రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టి విటీని పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీసీఈఏ అభిప్రాయపడింది. గుంటూ రు- గుంతకల్లు మధ్య గణనీయమైన స్థాయిలో ట్రాఫిక్‌ ఉందని, డబుల్‌ లైన్‌ నిర్మా ణంతో భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చుతుందని మంత్రిమండలి వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com