తిరుపతి విమానాశ్రయం త్వరలో కొత్త సొబగులను సంతరించుకోనుంది. విమానాశ్రయంలో సరికొత్త వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఓకే చెప్పింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్వర్యంలో భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టు అథారిటీకి చెందిన 1800 చదరపు మీటర్ల భూమిని ఏపీ విద్య,సంక్షేమ,మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కు కేటాయించేందుకు కేబినెట్ అంగీకరించింది. ఈ భూమిలోనే వీఐపీ లాంజ్ నిర్మాణం చేయనున్నారు. ఈ భూమిని ఏడాదికి రూపాయి లైసెన్స్ ఫీజుతో 15 ఏళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa