ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధానిని కలిస్తే తప్పా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 03:08 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : రైతుల సమస్యలపై అసెం బ్లీని స్తంభింపజేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య క్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీ ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విజయవా డలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ప్రధా న మంత్రిని కలవకపోతే అమెరికా అధ్యక్షుడిని కలు స్తామా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రధానికి రాసిన లేఖకు అప్పుడే అక్కడినుంచి సమా ధానం కూడా వచ్చిందని, దాన్ని ఇప్పుడు రాసినట్లుగా ఆంధ్రజ్యోతి ప్రచురించిందని, వాళ్లకు అది ఏ అధికారి నుంచి వచ్చిందో వాళ్లనే అడగాలని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని చాలా సావధానంగా విన్నా రని, ఆయన హోదా ఇస్తారనే ఆశ తమకు ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము హోదానే ప్రధాన అంశం చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జీఎస్టీ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బిల్లు ఒక ఫార్మాలిటీ అని కేంద్రం ఇదివరకే నాలుగు బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించిన నేపథ్యంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి అన్నీ కేంద్రం చేసిందన్నారు. జీఎస్టీకి ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. దానివల్ల మంచి జరుగుతుందని పన్నుల మీద పన్నులు పడే పరిస్థితి ఉండదు కాబట్టి రేట్లు తగ్గుతాయనే ఆశ ప్రతి సామాన్యుడిలోను ఉన్న నేపథ్యంలో అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. వైసీపీ తరపున కేంద్రంలో ఈ బిల్లుకు మద్దతిచ్చామని, రాష్ట్రంలో కూడా మద్దతివ్వడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోడానికి బిల్లు పెడుతున్నారు గానీ, రైతు ఆదాయాన్ని గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. గిట్టుబాటు, మద్దతుధరలు లేక ఏ పంట చూసినా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉండటంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ఉల్లి కిలో రూపాయికి, రెండు రూపాయలకు అమ్ముకుంటున్నారని, గత సంవత్సరం 25-30కి అమ్మారని కంది 8వేలు-8500 ఉంటే ఇప్పుడు మూడు, నాలుగు వేలకు కూడా కొనట్లేదన్నారు. పెసర గతంలో ఆరువేలు ఉంటే ఇప్పుడు  నాలుగువేలు పలుకుతోంది, మినుము గతంలో 12 వేలు అయితే ఇప్పుడు ఆరువేలు ఉంది


మిర్చి గత సంవత్సరం 12-14వేలు పలికితే ఇప్పుడు 800-4000 మధ్య అమ్ముకోవాల్సిన అధ్వానమైన పరిస్థితి ఉందన్నారు. పసుపు గత ఏడాది 9వేలు అమ్మితే ఈ ఏడాది 4000-4500 దాటడం లేదన్నారు. టన్ను మామిడి గత సంవత్సరం 45 వేలు పలికితే ఇప్పుడు 7వేలకు అమ్ముతున్నారని కానీ రైతు కొనాల్సిన పశుగ్రాసం మాత్రం ఎకరా పదివేల రూపాయలు ఉందన్నారు. ఒక గేదెకు ఒక ఎకరా కావాలి ఎండు గడ్డి రేటు ఎకరా పదివేలు, గత సంవత్సరం ఇది 5వేలు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి 2, 3 వేలు మాత్రమే ఉండేదన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతామన్నారని ఆయన గుర్తుచేశారు. మేం రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాం అనగానే రైతులను మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు పూర్తిగా రుణాల మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో బంగారం ఇంటికి తెస్తానని ఏ రకంగా మోసపూరిత మాటలుచెప్పాడో, వాటినే కొనసాగిస్తూ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారని గుర్తుచేశారు. మొన్న మిర్చి ధరల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే రైతు పరిస్థితి మారకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం అని చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నామన్నారు. రైతు పరిస్థితిని పట్టించుకోని చంద్రబాబుకు బుద్ధి వచ్చేందుకు రైతులకు తోడుగా నిలబడతామన్నారు. రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మార్కెట్లో దళారులు దారుణంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎవరైనా హెరిటేజ్‌ షాపుకు వెళ్లి మిర్చి కొనాలంటే 200 గ్రాముల ప్యాకెట్‌ 50 రూపాయలు. అంటే క్వింటాలు దాదాపు 25వేల రూపాయలు ఉందన్నారు. కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి రూ.2వేల నుంచి రూ.4 వేల మధ్యలో ఉందన్నారు. రైతు నుంచి వ్యాపారి వరకు పోయేసరికి ఇంత తేడా కనిపిస్తోందని చంద్రబాబు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటే హెరిటేజ్‌లో తన లాభాలు తగ్గుతాయని ఆందోళనయే ఇందుకు కారణమని పేర్కొన్నారు. హెరిటేజ్‌లో ఎక్కువ ధరలకు కొనాల్సి ఉంటుందని ఇంత దారుణంగా చంద్రబాబు దగ్గర నుంచి దళారులు, వ్యాపారులు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. 92 లక్షల క్వింటాళ్లు పండాయి కాబట్టి కనీసం 50 లక్షల క్వింటాళ్లు కొంటేనే మార్కెట్లో పోటీ వస్తుంది, వ్యాపారులు కూడా రేటు పెంచి కొనుగోలు చేస్తారని చెప్పారు. కేంద్రం కాస్తో కూస్తో ముందుకొచ్చి రూ5వేలు క్వింటాలుకు ఇస్తామని ముందుకొచ్చిందని ఇది సంతోషమన్నారు. కేంద్రం నుంచి అంత వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి మరో రూ3వేలు జతచేసి కనీసం రూ.8వేలకు అయినా కొనుగోలు చేస్తే రైతులకు కనీసం ఖర్చులు వస్తాయన్నారు. ఎకరాకు రైతుకు లక్షా 30 వేల నుంచి లక్షా 60 వేల వరకు ఖర్చవుతుందన్నారు. ఎకరాకు 13-15 క్వింటాళ్లు కూడా రాలేదు, రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మిర్చి, ఉల్లి, మామిడి, టమోటా.. ఏ పంట చూసినా రైతులు బతికే పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం కేవలం 2 కోట్లు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అన్నిరకాలుగా అండగా నిలిచేందుకు, చంద్రబాబు ఇంత దారుణంగా పాలన చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తూ, అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెబుతున్నామన్నారు. రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెట్టాల్సిందే, గిట్టుబాటు ధరలకు పంటలను కొనాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నామన్నారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారన్నారు. ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశాను దాన్ని కరుణాకర రెడ్డి కూడా చూపించారు, చంద్రబాబు తన అధికారంతో ఒకవైపు ప్రతిపక్షమే ఉండకూడదన్న దుర్బుద్ధితో నిస్సిగ్గుగా తన దగ్గర ఉన్న అధికారంతో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తుంటే అధికారులను ప్రలోభపెట్టి, వాళ్లతో తప్పులు చేయిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిధిలో ఉన్నాం ట్రంప్‌కో, అమెరికా గవర్నర్‌కో చేయలేం కదా, ప్రధానికే ఫిర్యాదు చేస్తాం కదా అని జగన్‌ ప్రశ్నించారు.  ఒక వ్యక్తికి బెయిల్‌ ఇచ్చి, ఆ బెయిల్‌ను రద్దు చేయాలని మళ్లీ కోర్టుకు పోవడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. తప్పు చేశాడని రుజువు కాకుండా జైల్లో పెట్టడమే తప్పు, రాజ్యాంగం ప్రకారం 3 నెలల్లోపు విడుదల చేయాలన్నారు. కానీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై కేసులు పెట్టారని అక్కడి నుంచి కేసులు నడిపించేవరకు కూడా అంతా వాళ్లే


అప్పుడు చంద్రబాబు ఫోన్లలోనే అధికారులతో నడిపించారు, వాళ్లు మీడియాకు సెలెక్టివ్‌ లీకులు ఇచ్చారని చెప్పారు. టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాజీ సీఎస్‌ ఏదో చెబితే, నేను ప్రభావితం చేశానని, బెయిల్‌ రద్దు చేయాలని అన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి ఇంత దారుణంగా చేస్తున్నాడు ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు, ఎవరి దగ్గరకు వెళ్తున్నారు, ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో అన్నింటి మీదా దర్యాప్తు చేయాలని లెటర్లు రాయడం ప్రజాస్వామ్యంలో తప్పదని అవతలివాడు కొడుతున్నా కొట్టించుకుంటే ఎవడూ బతకడని జగన్‌ అన్నారు. బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లేఖ తీసుకెళ్లి ఇస్తాడా అని ప్రశ్నింస్తూ చంద్రబాబు మీడియాను ఎంతలా మేనేజ్‌ చేస్తారంటే చివరకు ఒక మీడియా హౌస్‌ న్యాయం తరపున మాట్లాడాల్సింది పోయి జరగనిది జరిగినట్లుగా కుకప్‌ చేసిందని విమర్శించారు. తాను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే, వాళ్ల దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చిందని మే 10న తాను ప్రధానమంత్రిని కలిశాను బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లెటర్‌ తీసుకెళ్లి ఇస్తాడా అని జగన్‌ ప్రశ్నించారు. మొదటి పేజీ చూపిస్తే తేదీ చూపించాల్సి వస్తుందని చివర పేజీ వేశారని ఇదే లేఖ పెట్టి మీడియా అబద్ధాలు చెబుతుంటే ఈ వ్యవస్థలో ఎవరైనా బతకగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రధనమంత్రిని కలిసి సమస్యలు చెప్పడం తప్పా అని నిలదీశారు. ప్రధానితో హోదా సహా అన్ని విషయాలూ మాట్లాడామని గంట సేపు మాట్లాడితే సహజంగానే అన్నీ మాట్లాడతామని, ప్రత్యేక హోదా అంశం మీదే 10-15 నిమిషాలు చెప్పి ఉంటా నిజమా జగన్‌ మరి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అని ప్రధాని అన్నారంటే ఈయన ఏ రకంగా మిస్‌లీడ్‌ చేశారో అర్థమవుతుంది. 


ఇంకా ఆయన ఏమన్నారంటే ‘‘అగ్రిగోల్డ్‌ గురించి మాట్లాడాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు చంద్రబాబు కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చాయన్నాను, మిర్చి రైతుల అవస్థల గురించి కూడా మోదీతో ప్రస్తావించాను, సహజంగా రాజకీయాలు కూడా మాట్లాడతాం, చంద్రబాబు ఎలా దోచుకుంటున్నాడు, అవినీతిలో ఏపీని నెంబర్‌ 1 అని ఎలా చెప్పారు, కాగ్‌ నివేదిక చంద్రబాబు మీద ఆరోపణలను ధ్రువీకరిస్తూ ఎలా నివేదిక ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com