సాగునీటి సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధం

  Written by : Suryaa Desk Updated: Tue, May 16, 2017, 02:55 AM
 

 ( నెల్లూరు- సూర్య ప్రధాన ప్రతినిధి)  : సాగునీటి సంఘాలకు ఎన్ని కలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇప్పటికే ఆ దిశగా సన్నా హాలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని నీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మండలాల్లో ఓటర్ల జాబితాలను తహశీల్దారు వద్దకు వెళ్లి పరిశీలించుకుని త్వరగా జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా నీటి పారుదలశాఖ అధికారులు ఆయా మండలాల్లోని తమ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఇటీవల జరిగిన నీటి పారుదలశాఖ డివిజన్‌స్థాయి సమావేశాల్లోనే ఓటర్ల జాబితాలను సరిచేసుకోవాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. తహశీల్దారు కార్యాలయాల్లోని వీఆర్వోలు కూడా గ్రామాల్లో తిరిగి ఓటర్ల జాబితాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే పల్లెల్లో సాగునీటి సంఘాల ఎన్నికల హడావుడి వూపందుకోనుంది. వచ్చే జూన్‌, జులై నెలల్లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో నీటిపారుదలశాఖకు నాలుగు డివిజన్లున్నాయి. వీటి పరిధిలో మొత్తం మేజర్‌ ఇరిగేషన్‌ (హెచ్‌ఎల్‌సీ) కింద 93 సాగునీటి సంఘాలు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 43 నీటి సంఘాలు, మైనర్‌ ఇరిగేషన్‌ కింద 630 నీటి సంఘాలు కలిపి మొత్తం 766 నీటి సంఘాలున్నాయి. ఈ సంఘాలకు చెందిన వివరాలను రెవెన్యూశాఖకు అందజే యాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించే ముందుగా సంఘాలకు సంబంధిం చిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలి. మొదట ఆయా మండలాల నీటి పారుదల శాఖ ఇంజినీర్లు ఆయా మండలాల తహశీల్దారులకు సమాచారం ఇవ్వాలి. అనంతరం సంబంధిత వీఆర్వోలు నీటి సంఘాలకు సంబంధించిన ఓ టర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులు ఉంటే వాటిని సరిచేయాలి. దీనిపై తహ శీల్దార్లు వీఆర్వోలకు ఓటర్ల జాబితాల తయారీపై ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. నీటి సంఘాల పరిధిలోని ఆయకట్టు రైతులలో అర్హులైనవారిని గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలి. ఓటర్ల జాబితాలను సంబంధిత అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా సిద్ధం చేసిన తర్వాత రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల నిర్వహ ణకు ఏర్పాట్లు చేస్తుంది. చిన్ననీటిపారుదల శాఖలో ఉన్న ప్రతి నీటి సంఘానికి ఆరుగురు ప్రాదేశిక సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. మధ్యతరహా నీటి సంఘాల పరిధిలో 12 మంది ప్రాదేశిక సభ్యులు ఉంటారు. వీరిలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సాగునీటి సం ఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కలిసి ప్రాజెక్టు సంఘానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.


సుప్రీం కోర్టు ఆదేశాలతో


సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రెండేళ్ల కిందటే రాష్ర్ట ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో 2015 సెప్టెంబరులో ఆదరా బాదరాగా సాగునీటి సంఘాల పరిధిలో ఉన్న రైతులతో సమావేశాలను ఏర్పా టు చేసి పాలకవర్గాలను నియమించారు. ఇవి ఏకపక్షంగా జరిగాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా సిద్ధం చేసి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సన్నాహాలను చేస్తోంది. గత రెండేళ్లుగా సాగునీటి సంఘాలకు పాలక వర్గాలు ఉన్నప్పటికీ వారికి పను లు చేసేందుకు తగిన నిధులు ఇవ్వకపోవడంతో నీటి సంఘాల సభ్యులు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు ఓటర్ల జాబి తాలను సిద్ధం చేస్తున్నందున జాబితాల తయారీపై వివిధ పార్టీల నాయకులు దష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మండలాల నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండలాల తహశీల్దారులకు ఓటర్ల జాబితాలపై కసరత్తు చేయాలని లేఖలు ఇవ్వాలని సూచించారు.