అమెరికాలో రోడ్డు ప్రమాదం..తిరుపతికి చెందిన వ్యక్తి మృతి

  Written by : Suryaa Desk Updated: Mon, May 15, 2017, 05:03 PM
 

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. నార్తర్న్‌ ఇల్లినాయిస్‌ యూనివర్శిటీలో ఎలెక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తున్‌ అడ్లూరి సాయికుమార్‌ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాయికుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సాయికుమార్‌ ప్రయాణిస్తున్న కారును వెనుకనుండి వేగంగా వచ్చిన మరొక కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.