ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి అభివృద్ధికి ‘స్టార్టప్‌’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 15, 2017, 02:41 AM

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : ప్రభుత్వ భవనాన్ని ఆనుకుని తూర్పు దిక్కున ఉన్న ఈ స్టార్టప్‌ ఏరి యాను సింగపూర్‌ కన్సార్టియం ద్వారా స్విస్‌ చాలెంజ్‌ విధానంలో 3 దశల్లో అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిది ద్దేందుకు ఉద్దేశించిన అవగాహనా ప్త్రం(ఎంవోయూ)పై సోమవారం సంతకాలు, సదరు ఏరియా రానున్న మం దడం వద్ద శంకుస్థాపన, బహిరంగసభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అమరావతి అభ్యున్నతికి చోదకశక్తిగా ఉపకరించనున్న ఈ స్టార్టప్‌ ఏరియా అభివద్ధి కార్యక్రమా నికి శ్రీకారం చుట్టే శంకుస్థాపనను భారీ ఎత్తున నిర్వహిం చేందుకు ఏపీసీఆర్డీయే ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా అత్యంత క్రియాశీలక ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగాను, ప్రపం చంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు,జీవనయోగ్యమైన వసతులు కలిగిన నగరంగాను తీర్చిదిద్దితే రాజధాని నగరం అదుేతంగా ఉంటుందని రాష్ర్ట ప్రభుత్వం భావించింది. ఫలితంగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు, పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో తొలుత ఒక ప్రదేశాన్ని స్టార్టప్‌ ఏరియాగా అభివద్ధిపరచాలని నిర్ణయించింది. ‘సీబీడీ, సీడ్గ ఏరియా, ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్‌,్ర కోర్‌ ఏరియా’ ఇలా పలువిధాలుగా అభివద్ధిపరచాలని నిర్ణయించింది.


ప్రాజెక్ట్‌ వివరాలు


అమరావతి అభివద్ధి సంస్థ(ఏడీసీ)తో కలసి సింగపూర్‌ కన్సార్టియం ఒక ఎస్‌పీవీ(స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)ని స్థాపిస్తుంది. అమరావతి డెవల్‌పమెంట్‌ పార్ట్‌నర్‌(ఏడీపీ)గా దీనిని వ్యవహరిస్తారు. 


ఈ ఏడీపీ అమరావతి స్టార్టప్‌ ఏరియాలోని 1691 ఎకరాలను 3 దశల్లో, 15 సంవత్సరాల వ్యవధిలో అభివ ద్ధి పరుస్తుంది. తొలి దశలో 656 ఎకరాలు, 2వ దశలో 514 ఎకరాలు, 3వ దశలో 521 ఎకరాలను డెవలప్‌ చేస్తుంది. ప్రతి దశలో 70% భూమిని అభివ ద్ధి చేసి, విక్రయించిన తర్వాత తదుపరి దశను చేపడుతుంది. అయితే అభివ ద్ధి చేసిన ప్లాట్లను విక్రయించే అధికారం సీఆర్డీయేకే ఉంటుంది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రభుత్వానికి స్థూల విక్రయాదాయంపై వాటా(1వ దశలో 5్న, 2వ దశలో 7.5%, 3వ దశలో 12.5%) రూపంలోను, ఏడీపీ ఆర్జించే లాభాల్లో 42% వాటా(ఇతర పీపీపీ ప్రాజెక్టుల్లో ఇది సాధారణంగా 26%కి మించి ఉండదు) ద్వారానూ లభించడంతోపాటు దాదాపు రూ.2,118 కోట్ల వ్యయంతో ఇందులో ఏడీపీ కల్పించబోయే మౌలిక సదుపాయాలను అనంతరం సీఆర్డీయేకు బదలాయిస్తారు. నూతన రాజధానిలో ప్రపంచస్థాయి ఆర్ధిక వ్యవస్థకు బీజాలు పడడమే కాకుండా ఏడీపీ తొలిదశలోని మూడేళ్లలో 8.07 లక్షల చదరపుటడుగుల నిర్మాణాలను చేపట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com