వాకాటి ఇంటిపై సీబీఐ దాడులు

  Written by : Suryaa Desk Updated: Sat, May 13, 2017, 03:09 AM
 

నెల్లూరు, సూర్య ప్రతినిధి : ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ప్రాజెక్టుల పేరుతో లోన్లు తీసుకుని ఎగ్గొట్టి మోసం చేశా రంటూ ఇండస్ట్రీయల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఇచ్చిన పిర్యా దుతో సీబీఐ ఈ దాడులు చేసింది. వివిధ స్థిరాస్తులను తాకట్టుపెట్టి వాకాటికి చెందిన బీఎన్నార్‌ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్‌ 2014-15లో రూ. 190 కోట్ల రుణాన్ని పొందింది. ఆ తర్వాత ఎగ్గొట్టింది. దీంతో తమకు రూ. 205 కోట్ల నష్టంవచ్చిందని ఐఎఫ్‌సీఐ లిమి టెడ్‌ సీబీఐకు పిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిని సీబీఐ అధికారులు నెల్లూరుతోపాటు హైదరాబాద్‌, బెంగుళూరులో వాకాటికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 12మంది అధికారులు ఉదయం నుంచి వాకాటి ఇంట్లో రికార్డులు పరిశీలించారు. ఫైనాన్స్‌ వ్యవహారాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంతో సీబీఐ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వాహనాల్లో వచ్చిన అధికారులు ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించకుండా రికార్డులు పరిశీలిస్తూ, వాకాటిని పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. 


ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఓ ఫొటోగ్రాఫర్‌పై ఎమ్మెల్సీ అనుచరుడు కెమెరా లాక్కునేందుకు ప్రయత్నించడంతో వాకాటి బయటకు వచ్చి వారికి నచ్చజెప్పారు. తమ ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడం లేదని ఓ పక్క వాకాటి చెబుతుండగా, మరో పక్క సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు ఆయన్ను లోపలికి తీసుకెళ్లి తలుపులు వేయడం గమనార్హం.


వాకాటి నివాసంలో సీబీఐ సోదాలు పూర్తి :


  నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంలో చేపట్టిన సీబీఐ సోదాలు పూర్తయ్యాయి. అనంతరం వాకాటి మీడియాతో మాట్లాడుతూ ‘‘వ్యాపార లావాదేవీల వ్యవహారాలపై చర్చించేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. ఉదయం నుంచి పలు వివరాలు, పత్రాలు పరిశీలించారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా’’ అని వెల్లడించారు.


 వాకాటి నారాయణరెడ్డిపై అవినీతి, నకిలీపత్రాలు సష్టించి బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణల మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌, బెంగళూరులోని ఆయన సంస్థలతో పాటు, నెల్లూరులోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. పలుదస్త్రాలను పరిశీలించి, వాకాటిని కూడా విచారించారు. వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ మేనేజింగ్‌ డ్కెరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వాకాటి నారాయణరెడ్డితో పాటు సంస్థ సభ్యులు నకిలీపత్రాలు సష్టించి ఐఎఫ్‌సీఐ నుంచి రూ.205 కోట్లు అప్పు తీసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. 2014-15లో తన ప్రైవేటు సంస్థ పేరుతో కొన్ని నకిలీ పత్రాలు సష్టించి, పలుకుబడితో రూ.190కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్లు వెల్లడించింది. వాటిని సక్రమంగా చెల్లించకపోవడంతో ఇప్పటికే అసలుతో పాటు వడ్డీ కలిపి 205 కోట్ల రూపాయలకు చేరింది.ఈ దశలో వాకాటి సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంకులు సీబీఐకు ఫిర్యాదు చేయటంతో సీబీఐ బ ందాలు రంగంలోకి దిగాయి.