ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో నియోజకవర్గానికి కొత్తగా 2,200 ఇళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 03:06 AM

అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి: పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం వేల సంఖ్యలో అర్హులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ గహ నిర్మాణ పథకం ద్వారా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా మొదటి దశలో జిల్లాకు 16,750 ఇళ్లు మంజూరయ్యాయి. ఇంకా అధిక సంఖ్యలో అర్హులు ఉండటంతో కొత్తగా నాలుగు లక్షల ఇళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆశలు అధికమ వుతున్నాయి. మొదటి దశలో 16,750 ఇళ్లు రాగా, ఇప్పుడు కొత్తగా నియోజకవర్గానికి 2200 ఇళ్లు మంజూరు కానున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇందిరమ్మ పథకం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ గ హ నిర్మాణ పథకం ద్వారా యూనిట్‌ ధర లక్షా 50వేలకు పెంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో రెండు మూడేళ్లు గ్యాప్‌ రావడంతో ఇళ్ల కోసం ఎదురుచూసే వారి సంఖ్య అధికమైంది. మీ కోసం, జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఎన్టీఆర్‌ ఇళ్ల కోసం జిల్లాలో దాదాపు లక్షా 80 వేల మంది దరఖాస్తు చేసుకోగా, వాటన్నింటినీ నిబంధనల ప్రకారం వడపోసి అర్హుల జాబితాను ఇటీవల తేల్చారు. ఆ సంఖ్య లక్షా తొమ్మిది వేలు ఉండగా, వీటిలో మొదటిదశలో 16,750 మందికి ఇళ్లు మంజూరు జరిగింది. ఒకపక్క ఆర్థిక లోటును ఎదుర్కొంటూనే ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నా ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనకబడుతున్నారు. ఆ దిశగా నిర్దేశించిన లక్ష్యాలు అధిగ మించడంలోను అధికారులు విఫలమవుతున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 16,750 ఇళ్లలో ఇప్పటికి 10వేల ఇళ్లను ప్రారంభించడం కష్టమైంది. ఇంకా 6,750 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మ్త్రాం నెరవేరడం లేదు. ఇళ్ల నిర్మాణాల ప్రారంభం కోసం గహనిర్మాణ సంస్థ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నా లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి ఎదురవుతోంది. ఇందుకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొలతల సమస్యతో పాటు ముహూర్తాలు, తదితర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలన్నీ గ్రౌండ్గ కావడం లేదు. బిల్లుల చెల్లింపులోను జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటి ప్రభావం పథకం అమలుపై పడుతోంది. ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి యూనిట్‌ ధర లక్షా 50 వేలు కాగా, ఈ మొత్తాన్ని ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీ కింద అందిస్తోంది. రూ.98 వేలు రాష్ర్ట ప్రభుత్వం చెల్లిస్తుం డగా, మిగిలిన రూ.52 వేలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా సమకూరుస్తున్నారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్‌ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా అంతకు మించిన విస్తీర్ణం లో అక్కడక్కడా నిర్మాణాలు జరుగుతు న్నాయి. ఆయా ఇళ్లకు బిల్లుల చెల్లింపులు సమస్యగా మారుతున్నాయి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com