అమరావతికి ‘స్టార్టప్‌’

  Written by : Suryaa Desk Updated: Fri, May 12, 2017, 03:06 AM
 

(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : అమరా వతిరాజ ధాని రూపకల్పనలో కీలక ప్త్రా పోషించనున్న స్టార్టప్‌ ఏరియా అభివద్ధికి బీజం పడనుంది. 6.94 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివ ద్ధి పరచే మాస్టర్‌ డెవలపర్‌గా రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల నియమించిన సింగపూర్‌ కన్సార్టియం వచ్చే సోమవారం ఏపీసీఆర్డీయేతో కీలక ఎంవోయూ చేసుకోనున్నట్టు తెలిసింది. రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి, గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ రాజధాని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని ఒక అనువైన ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించా లనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యా లయం వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ బందం సభ్యుల సమక్షంలో ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు శిలాఫలకం ఆవిష్కరణ, ఎంవోయూ, సభ జరుగుతాయి. ఈ మేరకు సీఎంవో ఆదేశాల మేరకు గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌ కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని సందర్శించారు. జేసీ శుక్లా, గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌, వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాజధాని రైతులు, విద్యార్థులు సహా ఐదు వేలమంది సభకు హాజరవుతారని కలెక్టర్‌ తెలిపారు. కాగా, రాష్ర్ట మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పీ నారాయణ కుమారుడు ఆకస్మిక మతి చెందిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రద్దు కావొచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.