బాహుబలి 2 సినిమాలో.... నటీనటులు వాడిన ఆభరణాలు... అద్భుతంగా రావడం వెనుక బాహుబలి టీం కృషి ఎంతో ఉంది. భారతీయ సినిమాలోనే ఇంత భారీ పెట్టుబడితో తీసిన మరో సినిమా లేదు. ఈ భారీ తనానికి తగినట్లుగానే... సినిమాలో గ్రాండ్నెస్ కూడా కనిపించాలి. అందుకు సెట్స్ తోపాటు నటీనటుల ఆభరణాలూ ముఖ్యమే. బాహుబలి 2 సినిమాకు ఆమ్రపాలి అనే జ్యువలరీ కంపెనీ అవసరమై ఆభరణాలను అందించింది. సంప్రదాయపరంగా ఉండే 1500 నగలను పంపించింది. గాజులు, ఉంగరాలు, మాంగ్ టిక్కాలు..వంటివన్నీ కూడా... రాజమౌళి చెప్పిన విధంగాన ఆమ్రపాలి వాటిని రూపొందించిందట. ఆభరణాలన్నింటినీ.. వెండితో తయారు చేసి వాటికి బంగారు పూత వేశారు.