టెన్నిస్ బ్యూటీ మారియా షరపోవా మళ్లీ రాకెట్ పట్టింది. డోపింగ్ నిషేధం ముగిసిన తర్వాత షరపోవా తొలిసారి మ్యాచ్ ఆడింది. స్టట్గార్ట్ ఓపెన్ టోర్నీలో తొలి విక్టరీని నమోదు చేసింది. 15 నెలల నిషేధ విరామం తర్వాత షరపోవా మళ్లీ టెన్నిస్ ఆడింది. స్టట్గార్ట్ ఓపెన్ తొలి రౌండ్లో రాబర్ట్ విన్సీపై 7-5, 6-3 స్కోర్‌తో విజయం నమోదు చేసింది. నిషేధిత ఉత్ర్పేరకం మెల్డోనియ్ తీసుకున్న రష్యా ప్లేయర్ షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సంఘం ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో షరపోవా 15 నెలలుగా టెన్నిస్‌కు దూరంగా ఉంది. అయితే స్టట్గార్ట్ ఓపెన్‌లో జరిగిన తొలి మ్యాచ్ ఆరంభంలో షరపోవా కొంత తడబడింది. మొదట సెట్లో తొలి సర్వీస్ గేమ్‌ను కోల్పోయింది. కానీ తర్వాత పుంజుకున్న షరపోవా తొలి సెట్‌ను 7-5 తేడాతో సొంతం చేసుకున్నది. ఆ తర్వాత రెండవ సెట్లో ప్రత్యర్థిని ఈజీగా చిత్తు చేసింది.