హైదరాబాద్: బాహుబలి పార్ట్ 1లో అనుష్క లుక్ ఎంత అగ్లీగా ఉందో... చూడటానికి ఆమె లుక్ చాలా భయంకరంగా ఉండేది. అయితే పార్ట్ 2లో అనుష్క ఎంతో అందంగా కనిపించబతోంది. కథలో భాగంగా మొదటి పార్టులో అనుష్కను భయంకరమైన లుక్ లో చూపించారు. అయితే పార్ట్ 2లో మాత్రం అనుష్క చాలా అందంగా చూపించబోతున్నారు. తాజాగా అనుష్కకు సంబంధించిన న్యూ లుక్ తో బాహుబలి 2 పోస్టర్ ఒకటి రిలీజైంది. ఇందులో కుంతలదేశ యువరాణిగా అనుష్క కనిపించబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల కంటే అనుష్కను ఇందులో ఎంతో అందంగా చూపించారు అనడానికి ఈ ఫోటయే సాక్ష్యం. అందం మాత్రమే కాదు యాక్షన్ అనుష్క ఈ సినిమాలో కేవలం అందం పరంగానే కాదు.... యాక్షన్ సన్నివేశాల పరంగా కూడా ఎంతో ఆకట్టుకోబోతోంది. ముఖ్యంగా అనుష్క చేసే కత్తి యుద్దాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోబోతున్నాయి.