ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్భజన్ సింగ్‌కి కోపం వచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2017, 05:32 PM

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి కోపం వచ్చింది. అయితే ఇక్కడ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్, బౌలర్‌పై కాదు.. ఐపీఎల్‌లో క్రమం తప్పకుండా తప్పులు చేస్తున్న అంపైర్లపై అంతకంటే కాదు. ఓ విమాన పైలెట్ చేసిన జాతి వివక్ష మాటలపై కోపంతో వూగిపోయిన భజ్జీ వరుస ట్వీట్లతో అతడ్ని కడిగిపారేశాడు. భారతీయ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన సదరు పైలెట్.. ఓ దివ్యాంగుడిపై కూడా నోరు పారేసుకున్నట్లు హర్భజన్ వివరించాడు.


‘జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన పైలెట్ బ్రెండ్ హోస్లిన్ ఒకరిని.. యూ బ్లడీ ఇండియన్ గెట్ అవుట్ ఆఫ్ మై ఫ్లైట్’ అంటూ తిట్టాడని తొలుత భజ్జీ ట్వీట్ చేశాడు. అనంతరం కొద్దిసేపటికే ఇంకో ట్వీట్‌లో ‘ఆ పైలెట్ ఓ మహిళపై భౌతిక దాడికి దిగి.. ఓ దివ్వాంగుడితో కనికరం లేకుండా ప్రవర్తించాడని’ హర్భజన్ వివరించాడు. చివరగా ఆ పైలెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జెట్ ఎయిర్‌వేస్‌ని కోరిన ఈ స్పిన్నర్.. భారత్‌లో ఇలాంటి వారికి చోటు లేదంటూ హెచ్చరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com