ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`అంగన్‌వాడీ'ల ద్వారా పౌష్టికాహారం పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2017, 12:43 AM

  -ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు పెద్దపీట 


  -బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం


  -అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు ప్రభుత్వం ఆదేశం


  -ఆడపిల్లకు త్వరగా  పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు


   -స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత


  విజయవాడ, సూర్య బ్యూరో :  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వస్తున్నారు. పేదలకు పౌష్టికాహారమందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు విశేష కృషి చేస్తు న్నారు. ముఖ్యంగా చిన్నారుల్లోనూ, బాలింతల్లోనూ, గర్భిణుల్లోనూ పౌషకాహార లోపాలను తొలగించి, వారికి బలవర్ధకమైన ఆహారమందించడానికి ఏటా వేల కోట్ల రూపాయలను రాష్ర్ట ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సాయంతో సమీకత బాలల అభివద్ధి సేవల పథకం (ఐ.సి.డి.ఎస్‌.) కింద ప్రతి నెలా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 55,581 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లోనూ దూసుకు పోతోంది. ఇటువంటి సమయంలో బాలలు, మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడడం ఆందోళనకర అంశం. వారందరికీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీకి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 55,581 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటి ద్వారా బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను గర్భిణులకు, బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. అయిదేళ్ల లోపు చిన్నారులకు అంగన్‌వాడీీ కేంద్రాల్లోనే కిచిడి, పాలు, గుడ్లు అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మెనూ చార్టును రూపొందించింది. దీని ప్రకారం రోజుకో వంటకాన్ని చిన్నారు లకు అందించాలని అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు ప్రభుత్వం ఆదేశిం చింది. ఫిబ్రవరి నెలకు గానూ రాష్ర్టంలో ఉన్న 55,581 అంగన్‌వాడీ కేంద్రా లకు 84,811 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించింది. 18 లక్షలా 39 వేలా 78 కేజీల కందిపప్పుతోపాటు 13 లక్ష 5 వేల లీటర్ల పామాయిల్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు అందుబాటులో వుంచింది. 


జిల్లాల వారీగా కేటాయింపులివే:  ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యం. ఈ విషయం గ్రహించిన రాష్ర్ట ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 4,190 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటికి ఫిబ్రవరి నెలకు గానూ 4,800 క్వింటాళ్ల బియ్యం, లక్షా 3 వేల కేజీల కందిపప్పు కేటాయించారు. అలాగే, 72 వేల లీటర్ల పామాయిల్‌ కూడా అందుబాటులో ఉంచారు. విజయనగరం జిల్లాలో 3,728 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటికి 3,679 క్వింటాళ్ల బియ్యం, 80,194 కేజీల కందిపప్పు, 54 వేల లీటర్ల పామాయిల్‌ అందుబాటులో ఉంచారు. విశాఖపట్నం జిల్లాలో 4,951 కేంద్రాలకు 5,934 క్వింటాళ్ల బియ్యం, లక్షా 38 వేల కేజీల కందిపప్పు, 95 వేల లీటర్ల పామాయిల్‌ కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లాలో 5,546 అంగన్వాడీ కేంద్రాలకు 7,543 క్వింటాళ్ల బియ్యం, లక్షా 60 వేల కేజీల కందిపప్పు, లక్షా 21 వేల లీటర్ల పామాయిల్‌ కేటాయిం చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,889 అంగన్‌వాడీ కేంద్రాలు న్నాయి. వాటికి 7 వేల క్వింటాళ్ల బియ్యం, లక్షా 49 వేల కేజీలకు పైగా కంది పప్పు, లక్షా 9 వేల లీటర్ల పామాయిల్‌ అందుబాటులో ఉంచారు. కష్ణాజిల్లాలో ఉన్న 3,812 అంగన్వాడీ కేంద్రాలకు 5,887 క్వింటాళ్ల బియ్యం, లక్షా 28 వేల కేజీలకు పైగా కందిపప్పు, 89 వేల లీటర్ల పామాయిల్‌ అందుబాటులో వుంచా రు. గుంటూరులో ఉన్న 4,405 అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన లబ్ధిదారుల నిమిత్తం 7,960 క్వింటాళ్ల బియ్యం, లక్షా 71 వేల కేజీల కందిపప్పు, లక్షా 22 వేల లీటర్ల పామాయిల్‌ కేటాయించారు. ప్రకాశం జిల్లాలో 4,244 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 6,086 క్వింటాళ్ల బియ్యం, లక్షా 29 వేల కేజీల కందిపప్పు, 93 వేల లీటర్లకు పైగా పామాయిల్‌ కేటాయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న 3,774 అంగన్‌వాడీ కేంద్రాలకు 5,158 క్వింటాళ్ల బియ్యం, లక్షా 10 వేల కేజీలకు పైగా కందిపప్పు, 77 వేల లీటర్ల పామాయిల్‌ కేటాయించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఉన్న 3,621 అంగన ్‌వాడీ కేంద్రాలకు 5,489 క్వింటాళ్ల బియ్యం, లక్షా 16 వేల కేజీల కందిపప్పు, 82 వేల లీటర్ల పామాయిల్‌ అందుబాటులో ఉంచారు. కర్నూల్‌ జిల్లాలో 3,549 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు డిసెంబర్‌ నెలకు గానూ 8 వేల క్వింటాళ్ల బియ్యం, లక్షా 74 వేల కేజీల కందిపప్పు, లక్షా 21 వేల లీటర్ల పామాయిల్‌ కేటాయించారు. అనంతపురం జిల్లాలో ఉన్న 5,108 అంగన్‌వాడీ కేంద్రాలకు 9,657 క్వింటాళ్ల బియ్యం, 2 లక్షలా 5 వేల కేజీలకు పైగా కంది పప్పు, లక్షా  48 వేల లీటర్లకు పైగా పామాయిల్‌ అందుబాటులో వుంచారు. చిత్తూరు జిల్లాలో 4,764 కేంద్రాలున్నాయి. వాటికి 7,584 క్వింటాళ్ల బియ్యం, లక్షా 72 వేల కేజీల కందిపప్పు, లక్షా 20 వేల లీటర్ల పామాయిల్‌ కేటాయించారు. ఇప్పటికే అవసరమైన మేరకు ఆయా నిత్యావసర సరుకులను అవసరమైన మేరకు అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేశారు. బియ్యం, పామాయిల్‌, కందిపప్పు మాత్రమే కాకుండా గర్భిణులకు నాలుగో నెల నుంచి రోజుకు ఒక గుడ్డు, పాలు అందజేస్తూ వుంటారు.   చిన్నారులకు కూడా గుడ్లు పంపిణీ చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com