ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2017, 12:41 AM

 -నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే పనులు


 -దశల వారీగా రైల్వే స్టేషన్ల ఆధునికీరణ


 -అవసరమైన చోట ఆర్‌వోబిలు, ఆర్‌యూబిలు నిర్మాణం


 -ఒంగోలులో లిప్టు ఏర్పాటుకు చర్యలు


 ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌  సూర్యప్రతినిధి, ఒంగోలు : రైల్వే ప్రయాణీకుల భద్రతకు పెద్ద పీట వేయడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. తెనాలి నుంచి గూడూరు వరకు వార్షిక తనిఖీలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన ఒంగోలు రైల్వే స్టేషన్‌లో శుక్రవారం విలేకర్లతో మాట్లా డారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఇప్పటికే ఎక్సలేటర్‌ ఉన్న నేపథ్యంలో మరో లిప్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ నుంచి గుడూ రు వరకు మూడవ లైన్‌ పనులు చేపడతామన్నారు. ఎంపిక చేసిన స్టేషన్లలో బహుళ సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంద న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన నడికుడి- శ్రీకాళహస్తి పనులు త్వరలోనే ప్రారం భిస్తామని హామీ ఇచ్చారు. మొదటి దశ 28 కి.మీ మార్గం పనులు 2017లో పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తవగానే  రెండో దశ పనులు ప్రారంభిస్తామన్నారు. అమరావతికి ప్రధాన లైన్‌ ఏర్పాటు చేసేందుకు రూ.2,680 కోట్ల అంచనా వ్యకంతో కేంద్రం  నూతన ప్రాజెక్టును ఆమోదించిం దన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లను ఆపాలని వచ్చిన ప్రతిపాదనల పై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తయారైన  రైళ్ల సమయ పట్టికను ఇప్పటికిప్పుడు మార్చలేమని, దీని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణీకులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుం టు న్నామన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆర్‌వోబిలు, ఆర్‌యూబిల నిర్మా ణాలకు చర్యలు తీసుకుంటున్నామని జనరల్‌ మేనేజర్‌ చెప్పారు. రైల్వే శాఖ ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 24 గంటలు పని చేస్తుం దన్నారు. 


స్టేషన్‌ పరిసరాలు తనిఖీ:  వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఒంగోలు వచ్చిన జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తొలుత ఎక్సలేటర్‌, సిగ్నల్‌ వ్యవస్థను, రైల్వే స్టేషన్‌ ఆవరణను తనిఖీ చేశారు. అనంతరం రైల్వే గ్యాంగ్‌ యూనిట్‌ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు. రైల్వే గ్యాంగ్‌ యూనిట్‌ బాగా పని చేస్తుందంటూ వారిని అభినందిస్తూ రూ.20వేల నగదు పారితోషకాన్ని వారికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. రైల్వే జనరల్‌ మేనేజర్‌ వెంట విజయవాడ డిఆర్‌ఎం అశోక్‌ కుమార్‌, సీనియర్‌ డిసిఎం షఫాలికుమార్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఒంగోలు స్టేషన్‌ మాస్టర్‌ ఆదినారాయణ, టికెట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సయ్య తదితరులు ఉన్నారు. 


జీఎంను కలిసిన వేమూరి బుజ్జి: ఒంగోలు వచ్చిన రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ను సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌ జోనల్‌ యూజర్‌‌స కన్సల్టేటివ్‌ సభ్యులు ( జడ్‌ఆర్‌యుసిసి మెంబర్‌) వేమూరి సూర్యనారాయణ (వేమూరి బుజ్జి) కలిశారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బుజ్జి జీఎం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తెలుసుకున్న జీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


పలు సమస్యల పై ఎమ్మెల్యే ప్రతినిధి వినతి పత్రం:   శుక్రవారం ఒంగోలు వచ్చిన రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ కు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ ప్రతినిధి ఒంగోలు ఏఎంసీ చైర్మెన్‌ శింగరాజు రాంబాబు జీఎంకు వినతి పత్రం అందజేశారు.  అన్నవరప్పాడులోని గుడిసె వాసుల సంఘం తరుపున సుమారు 45 సంవత్సరాల నుండి అక్కడ నివశిస్తూ, గతంలో రేటు నిర్ణయించిన ప్రకారం డబ్బులు కూడా రైల్వే వారికి చెల్లించారని, గుడిసెవాసుల వారికి పాత రేటు ప్రకారం వారికి న్యాయం చేయా లని కోరారు.  ఒంగోలు సంతపేటలోని అగ్రహారం రైల్వే గేట్‌  దగ్గర రైల్వే బ్రిడ్జి ని త్వరతిగతిన చేపట్టాలని కోరారు. సూరారెడ్డి పాలెం రైల్వే వంతెనను త్వరత గతిన పూర్తి చేయాలని కోరారు. ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మంది రం ఎదురుగా ఉన్న రైల్వే ఖాళీ స్థలంలో చెత్త,మురుగుతో నిండి ఉందని, అక్కడి ప్రజలు చాలా ఇబ్బందుకుల గురవుతున్నారని, అందు వలన ఆ స్థలంను ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదలాయించాలని అక్కడి ప్రజల కొరకు మంచి పార్కును అభివృద్ధి చేయుటకు కోరారు. ఒంగోలు ఎమ్మెల్యే విజయవాడ లో సీఎం కేసీఆర్‌ సమావేశంలో ఉన్నందున ఆయన ప్రతినిధిగా తాము వచ్చామని శింగరాజు రాంబాబు చెప్పారు. 


పలు ఎక్‌‌సప్రెస్‌ రైళ్లకు ఒంగోలులో హాల్‌‌ట కల్పించాలి:  ఒంగోలు మీదుగా వెళ్లే పలు ఎక్‌‌సప్రెస్‌ రైళ్లకు ఒంగోలులో హాల్టు కల్పించాలని కోరుతూ ఒంగోలు ఎంపి వై.వి.సుబ్బారెడ్డి ప్రతినిధులు రైల్వే జీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. కెరళా ఎక్‌‌సప్రెస్‌, జోద్‌పూర్‌ ఎక్‌‌సప్రెస్‌, జైపూర్‌ ఎక్‌‌సప్రెస్‌, పాండిచ్చేరి ఎక్‌‌సప్రెస్‌లకు ఒంగోలులో హాల్టు కల్పించాలని కోరారు. 


జీఎంను కలిసిన రాయపాటి : దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ను , దక్షిణ మధ్య కమర్షియల్‌ మేనేజర్‌ శిపాలిలను డిఆర్‌ యుసిసి సభ్యులు రాయపాటి అంకయ్య, ఒంగోలు రైల్వే స్టేషన్‌లో కలిశారు. మర్యాదపూర్వకంగా డిజియం, డిసియంలకు పు„ష్పగుచ్చంతో సత్కరించారు. ఒంగోలు, కరవది, అమ్మన …బ్రోలు, టంగుటూరు, సింగరాయకొండ, రైల్వే స్టేషన్‌లో ప్రజలకు  కావల్సిన వసతుల గురించి రైల్వే అధికారులు దృష్టికి తీసుకుని చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com