ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ జనసేన అధ్యక్షుడు ఈ యంగ్ హీరోయేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 04:45 PM

తెలంగాణలో జనసేన పార్టీకి యంగ్ హీరో నితిన్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ పై పవన్ కల్యాణ్ పూర్తిగా దృష్టిపెట్టారు. అక్కడి సమస్యలపైనే ఎక్కువగా పోరాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు స్థానిక సమస్యలను ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఉత్తరాది నేతలు దక్షిణాదిపై వివక్షను చూపుతున్నారని కూడా పవన్ పదే పదే బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో పార్టీ బాధ్యతలను హీరో నితిన్ కు అప్పగించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.


సినిమాలపైనే దృష్టి…..టాలీవుడ్ లో హీరో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనను అభిమానించే వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. పవన్ కు వీరాభిమానిగా నితిన్ కు పేరుంది. నితిన్ నిర్మాణ సారధ్యంలో పవన్ కల్యాణ్ తో సినిమా కూడా తీస్తున్నారు. తన పొలంలో పండిన పంటలను పవన్ కల్యాణ్ నితిన్ ఇంటికి కూడా పంపుతారు. అలాంటి నితిన్ కు తెలంగాణ జనసేన పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే నితిన్ యంగ్ హీరో కావడం, సినిమాల్లో ఆయనకు ఇంకా భవిష్యత్ ఉండటంతో ఈ వార్తలను ఆయన అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ దృష్టంతా సినిమాలపైనే ఉందంటున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే తెలంగాణలో జనసేనను నితిన్ బలపర్చేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నితిన్ ఇంతవరకూ ఖండించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. జనసేన పార్టీ కూడా దీనిపై స్పందించకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com