దర్శకులు, రచయితలతోనే ఈ గుర్తింపు: అమిర్ ఖాన్

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 25, 2017, 01:58 PM
 

దర్శకులు, రచయితలతోనే తాను ఈ స్థాయికి  చేరుకోగలిగానని బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ అన్నారు. అవార్డు వేడుకలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన.. 16ఏళ్ల కిందట అమిర్ నటించిన లగాన్ సినిమాకు వచ్చిన విశేష్ పురస్కారాన్ని ఇప్పుడు అందుకున్నారు. లెజండరీ సింగర్ కోరిక మేరకు ఈ వేడుకకు హాజరు కాగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయనకు ఈ అవార్డును బహుకరించారు. ఇటీవల విడుదలైన దంగల్ సినిమాతో ప్రపంచస్థాయిలో మరోసారి గుర్తింపు తెచ్చుకున్న అమీర్.. తనతో ఈ సినిమాకు గుర్తింపు రాలేదని, ఆ సినిమాతోనే తన ప్రతిభ బయటకు వచ్చిందన్నాడు. దీనంతంటికి కారణంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, కథను అందించిన రచయిత తోనే సాధ్యమైందని, తానెక్కడికి వెళ్లిన ఈ విషయమే చెబుతున్నానని పేర్కొన్నాడు.రెండేళ్ల కిందట దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో వివాదమైందో తెలిసిందే. ఈ అంశంపై జాతీయభావాలు ఉన్న ప్రతి ఒక్కరు స్పందించారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు కూడా దీనిపై మండిపడ్డాయి. తాజాగా అంతటి వివాదానికి కేంద్రమైన అమీర్ ఖాన్... ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. స్వయంగా ఆయన చేతుల మీదుగానే ఈ అవార్డును అందుకోవడం విశేషం.