విడుదలకు సిద్దమైన కేశవ

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 25, 2017, 01:51 PM
 

తేడాది ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో కెరీర్లోనే భారీ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘కేశవ’. రివెంజ్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని ‘స్వామిరారా’ సినిమాతో నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. సినీ వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తైపోయిందని తెలుస్తోంది.అలాగే చిత్రాన్ని మే 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత అభిషేక్ నామా అన్ని ఏర్పాటులు చేస్తున్నారు. ఇకపోతే అన్ని ఏరియాల్లో ఈ సినిమా బిజినెస్ పూర్తయినట్టు సమాచారం. తు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా కొప్పికర్ పోలీస్ పాత్ర చాలా థ్రిల్లింగా ఉంటుందని తెలుస్తోంది. వీరితో పాటు ప్రముఖ కమెడియన్స్ వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.