టెక్నాలజీ సహకారంతో భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు

Updated: Sat, Feb 18, 2017, 12:37 AM
 

మేజర్‌న్యూస్‌  తిరుమల ప్రత్యేక ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనార్ధం దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చేసే భక్తులకు టెక్నాలజి సహకారంతో టిటిడి అత్యంత పారదర్శకంగా సేవలు అందిస్తున్నదని టిటిడి ఇఓ డాక్టర్‌ డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం టాటా సన్‌‌స ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేదపండ ితులు వేదాశీర్వచనాన్ని నివేదించారు. ఆయనకు స్వామి వారి వస్త్రాన్ని, తీర్ధప్రసాదాలను, చి్తప్రటాన్ని ఇఓ బహుకరించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ సాంకేతిక రంగంలో దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌), హెచ్‌సిఎల్‌ వంటి ఐటి సంస్థల సహకారంతో గత ఏడాదిన్నర కాలంగా శ్రీవారి భక్తులకు దర్శన, వసతి, లడ్డూ ప్రసాదం తదితర సదుపాయాలు కల్పించడంలో టిటిడి అత్యంత పారదర్శకమైన సేవలను అందిస్తున్నదన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజిని వినియోగించుకుంటూ భక్తులకు సేవలు చేయాలన్నదే టిటిడి లక్ష్యం అన్నారు. సామాజిక బాధ్యతగా టిసిఎస్‌ సంస్థ టిటిడికి అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఇటీవల టాటా సన్‌‌స ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నటరాజన్‌ చంద్రశేఖరన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం టిసిఎస్‌ అధినేత నటరాజన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ టిటిడి ఇఓ డాక్టర్‌ డి. సాంబశివరావు దార్శనికతలో టెక్నాలజి సహకారంతో పారదర్శ కమైన మార్పులను తీసుకురావచ్చునని రుజువు చేయడానికి ఇటీవల టిటిడిలో భక్తుల సౌకర్యార్ధం తీసుకువచ్చిన అనేక విప్లవాత్మకమైన సం్కరణలే నిదర్శనమన్నారు.  భవిష్యత్తు లో టిటిడితో కలిసి భక్తులకు మరింత విశేష సేవలు అందించడానికి తాము ఎల్లపడూ సిద్ధమేనని ఆయన ఉద్ఘాటించారు.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper