కన్నడ రీమేక్‌లో రాంచరణ్..?

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 25, 2017, 01:43 PM
 

   సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ తేజ, సమంత ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తాజాగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'రేపల్లె' అనే టైటిల్‌ను చిత్రవర్గాలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇందులో చెర్రీ, సమంత ఇద్దరూ దివ్యాంగులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర పేరును చిట్టిబాబుగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక ముందే రాంచరణ్ చేయనున్న తదుపరి సినిమా గురించిన వార్త తెలిసింది. కన్నడలో హిట్ అయిన 'బహద్దూర్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రీమేక్ హక్కులను కొనడంలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఒక వేళ ఈ డీల్ సక్సెస్ అయితే రీమేక్ చిత్రంలో రాంచరణ్ హీరోగా నటించనున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు అల్లు అరవింద్ చెర్రీ నటించిన మగధీర, ధృవ చిత్రాలను నిర్మించగా, ఇప్పుడు తాజాగా బహద్దూర్‌తో మరోసారి రాంచరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు తెలిసింది. తెలుగులో రానున్న బహద్దూర్ చిత్రానికి గాను అల్లు అర్జున్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారని కూడా తెలియవచ్చింది. గతంలో చెర్రీ, బన్నీ ఇద్దరు కలసి ఎవడు సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బహద్దూర్ సినిమాకు కూడా ఇద్దరూ పనిచేయనున్నట్టు తెలిసింది.