ఊరి ప్రజలతో మమేకమైన చెర్రీ జంట

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 25, 2017, 01:15 PM
 

ధృవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీ ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా, రీసెంట్ గా కొల్లూరికి షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో చెర్రీ, సమంతలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఇక చెర్రీ కి తోడుగా ఉపాసన కూడా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చేసింది. అక్కడ కొల్లేటి అందాలను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. రీసెంట్ గా చెర్రీ-ఉపాసనలు పేరంటాలపల్లి , పాపికొండలు ప్రజలని కలిసి వారితో సరదాగా గడిపారు. వారి ఆదరణకి ఇంప్రెస్ అయిన ఉపాసన తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.