రాష్ట్రంలో 8 ఐ.టి. కంపెనీలు ప్రారంభమవ్వడం శుభసూచికం

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 18, 2017, 12:32 AM
 

   విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ట్రంలో 8 ఐ.టి కంపెనీలు నేడు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రారంభం అవ్వడం శుభసూచకమని, రాబోయే కాలంలో అమరావతిలో మరిన్ని ఐ.టి కంపెనీలు రానున్నాయని సమాచార పౌరసంబంధాలు, ఐ.టి శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి చెప్పారు. శుక్రవారం నగరంలోని ఇండ్గవెల్‌ టవర్‌‌సలో ఐ.టి సర్వీస్‌ టెక్‌ పార్‌‌క ప్రారంభం సందర్భంగా దానిని సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐ.టి సర్‌‌వ అలయన్‌‌స ఆధ్వర్యంలో 8 ఐ.టి కంపెనీలు  ఇండ్గవెల్‌ టవర్‌‌సలో ప్రారంభమవడం రాష్ట్ర అభివృద్ధికి ఇవి మైల్‌స్టోన్‌గా నిలుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కావలసిన టెక్నాలజీ అందించ డానికి ఇవి తోడ్పాటునందిస్తాయని తెలిపారు. విశాఖపట్నంలో 9 ఐ.టి కంపెనీలు తమ యాక్టివిటీస్‌ ప్రారంభించాయని తెలిపారు. రోబోటెక్‌‌స, బ్లాక్‌ చైన్‌, టెక్నాలజీ లాంటి కోర్సులకు ఇక్కడ ట్రైనింగ్‌ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రొత్త సాంకేతిక పరిజ్ఞానా నికి ప్రాముఖ్యంతోపాటు ఎలక్ట్రానిక్‌‌స కూడా ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నామ న్నారు. రాష్ట్రంలో ఐ.టి కంపెనీలు పెట్టాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చేయుతనందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సాంకేతిక పరిజ్ణానానికి పెద్దపీట వేయడం వల్ల రాష్ట్రంలో ఐ.టి కంపెనీల స్ధాపనకు ముందుకు వస్తున్నా రన్నారు. ఈప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రగ్రామిగా ఉందని, పైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్‌‌ట క్రింద ఫోన్‌, నెట్‌, టివీలకు సాంకేతిక పరిజ్ణానం తక్కువ ఖర్చుతోటే అందు బాటుల్లోకి వస్తుందన్నారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని అమరావతిలో ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రొత్త టెక్నాలజీ అందుబాటుల్లోకి తేవడంతో పాటు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ద్వారా నిరుద్యోగ అభ్యర్ధులకు ట్రైనింగ్‌ అందజేయనున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో అమరావతి రాజధానిలో వేల మంది ఐ.టి నిపుణులను తయారుచేసే కేంద్రంగా వృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం వస్తుందనడంలో ఎటువంటి సందేహాం లేదని, ఐ.టి రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేదోడువాదోడుగా ఉంటారని తెలిపారు. భారతదేశంలోనే మొదటి సారి ట్రైనింగ్‌ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్రంలో ఇదే ప్రప్రధమని తెలిపారు. మంత్రితోపాటు విజయవాడ తూర్పు ఎమ్మేల్యే గద్దె రామ్మోహన్‌ రావు, ఐ.టి సర్‌‌వ అలెయన్‌‌స సి.ఈ.వో రవి తదితర ఐ.టి ఉద్యోగులు, 8 కంపెనీ ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.