కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 06:32 PM
 

చండీపూర్ :  ఒడిశాలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన మానవరహిత లక్ష్య విమానం కూలింది. బాలసోర్ జిల్లాలోని చండామణి గ్రామ పరిసరాల్లో ఈ విమానం కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. యూఏవీ ట్రయల్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో లక్ష్య మానవ రహిత విమాన టెస్టింగ్ నిర్వహిస్తున్నారు.