మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 05:35 PM
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఏర్పేడులోని పీఎస్‌రోడ్డులో ఓలారీ అదపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లిన ఘటనలో 12 మంది మృతి చెందగా 20మంది గాయపడ్డారు.