గ్లామర్ తోనైనా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 04:44 PM
 

సాధారణంగా హీరోయిన్లు మొదట్లో చాలా కట్టుబాట్లు, లిమిట్స్ లో ఉండటం.. ఆ తర్వాత స్టార్ డమ్ పెరిగేకొద్దీనో, లేక అవకాశాలు తగ్గేకొద్దీనో లిమిట్స్ చెరిపేసుకొని కాస్త గ్లామర్ ఒలకబోయటం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కామన్. బాలీవుడ్ లో మొదటి సినిమా నుంచే లిమిట్స్ చెరిపేసుకోవటం సౌత్ లో తక్కువ. తమిళంలో చాలా సినిమాలు చేసినా, ఇప్పటికీ ఒకేసారి 5 సినిమాల్లో నటిస్తున్నా కూడా స్టార్ ఇమేజ్ దక్కని నందిత శ్వేత మాత్రం.. కేవలం ఇమేజ్ కోసమే గ్లామర్ డాల్ గా మారిపోతోంది. తెలుగులో నిఖిల్ తో పాటు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నందిత.. ఆఫర్లు ఉన్నా గుర్తింపు రాకపోవటంతో ఇక గ్లామరస్ గా కనిపించక తప్పదని భావిస్తోంది.
తమిళంలో ప్రస్తుతం 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా, మరో 3 సినిమాలు షూటింగ్ లో ఉన్నా, ఇప్పటికే 10కి పైగా సినిమాలు విడుదలై ఉన్నా.. నందితకు మాత్రం మంచి గుర్తింపు రావటం లేదు. దీంతో.. ఇక తప్పదని భావించిన ఈ యంగ్ హీరోయిన్.. గ్లామర్ తోనైనా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే హాట్ హాట్ ఫోటో షూట్లు చేసేస్తూ సినీ జనాన్ని ఆకర్షిస్తోంది. పద్ధతిగా కనిపిస్తే జనాన్ని ఆకట్టుకోలేకపోయాననేమో.. ఇక గ్లామర్ డ్రెస్సుల్లో కనిపించేందుకు ఫిక్సయ్యింది. ఈ సారైనా ఈ  పిల్లను జనాలు మంచి హీరోయిన్ గా గుర్తిస్తారో లేదో మరి.