దుబాయ్‌లో బాహుబలి’ చిత్ర బృందం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 03:34 PM
 

బాహుబలి’ చిత్ర బృందం ప్రచార కార్యక్రమం కోసం దుబాయ్‌ వెళ్లింది. అక్కడి సిటీ వాక్‌లోని రాక్సీ సినిమాస్‌లో 25న జరగనున్న ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్‌, రానా, అనుష్క పాల్గొననున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బాహుబలి సినిమా తెరవెనుక చేసే అద్భుతాల గురించి చూపించబోతున్నామని రోక్సీ సినిమాస్‌ ప్రతినిధులు తెలిపారు.బాహుబలి చిత్రం బృందం దుబాయ్‌ రావడం పర్యటకశాఖకు కనులపండువలా ఉంటుందని డీసీటీసీఎం(దుబాయ్‌ కార్పొరేషన్‌ ఫర్‌టూరిజం అండ్‌ కామర్స్‌ మార్కెటింగ్‌) సీఈవో ఇస్సాం కాజిమ్‌ తెలిపారు. ఇలాంటి సినిమాలు దుబాయ్‌లో ప్రదర్శించడం ద్వారా దుబాయ్‌, ఇండియా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో 2020 నాటికి పర్యటకుల సంఖ్య 20 మిలియన్లకు చేరాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కాబోతోంది