పీఎన్ రోడ్డుపై ఘోర ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 02:15 PM
 

చిత్తూరు : ఏర్పేడ్ లోని పీఎన్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ ముందుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సమీపంలోని దుకాణంలోనికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమౌతున్నది. కొందరు విద్యుదాఘతంతోనూ, మరి కొందరు లారీ కింద పడి మరణించినట్లు చెబుతున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ సంఘటన జరిగిన వెంటనే పరారయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పిఎన్ రోడ్డుపై రాకపోకలు సూర్తిగా స్తంభించిపోయాయి.