అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 12:39 PM
 

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ‌ఆయనతో పాటు సబిత, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌, విజయసాయిరెడ్డిలు కూడా కోర్టుకు హజరయ్యారు. విచారణ వచ్చేనెల 21కి వాయిదా వేసినట్లు సమాచారం . బెయిల్‌ రద్దు పిటిషన్‌పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. కాసేపట్లో వాదనలు ప్రారంభంకానున్నాయి. జగన్‌ తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించబోతున్నారు. సీబీఐ తరపున సురేందర్‌రావు వాదనలు విన్పించనున్నారు.