ఎస్‌.సి.ల జనాభా దామాషా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 01:16 AM
 

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను గుర్తిస్తూ ఒక్క ఎస్‌.సి.లను మాత్రమే నిర్లక్ష్యం చేస్తోందని, ఎస్‌.సి. జనాభా దామాషా ప్రకారం 18 శాతం రిజర్వే షన్‌లు ప్రభుత్వం కల్పించాలని మాల, మాల ఉప కులాల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్‌ చేసి ంది. గురువారం ట్యాంక్‌బండ్‌ - అంబేద్కర్‌ విగ్ర హం వద్ద సమితి అధ్యక్షులు చెరుకు రాంచం దర్‌ తో పాటు ప్రధాన కార్యదర్శి దాసరి భాస్కర్‌, యస్‌. నాగేష్‌, గూడప్ప మన్‌మోహన్‌ తెలంగాణ కాటి కాపర్ల సంఘం అధ్యక్షులు దాసరి సత్య నారాయణ, మన్యశ్రీ వరరావు, సి.హెచ్‌.గిరి లతో కలిసి రాంచందర్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాబి.ఆర్‌. అంబేద్కర్‌ కల్పించిన ఆర్టికల్‌ 3 ద్వా రానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఎస్‌.సి. సామాజిక వర్గాలకు నాడే జనాభా దామాషా ప్రకారం 15 శాతం రిజర్వేషన్‌లను కల్పించారని, 70 సంవత్సరాలలో ఎస్‌.సి. జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు పెంచాల్సి ఉన్నా ఆ వైపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముంద డుగు వేయకుండా దళితులను అణగదొక్కడానికే ప్రయత్నిస్తున్నారన్నారు. ఎస్‌.సి. ఉపకులాల్లో రాజకీయంగా, విద్యా-ఉద్యోగ రంగాల్లో తీవ్రస్థాయిలో వెనక్కి నెట్టి వేయబడ్డారని ఏ ప్రభుత్వాలు వారి గోడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని అన్ని వర్గాలను ఆదరిస్తున్నట్లుగానే ఎస్‌.సి.లను గుర్తించాలన్నారు.