మోడీ బిజీ మే 12 నుంచి జూలై వరకు విదేశీ పర్యటనల్లో ప్రధాని

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 01:06 AM
 

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలతో మరోసారి బిజీకానున్నారు. మే 12 నుంచి జూలై నెల మధ్య వరకు ఆయన వివిధ దేశాల్లో పర్యటించి, ఆయా దేశాలతో బంధాలు బలపరచనున్నారు. శ్రీలంక పర్యటన నుంచి ఆయన పర్యటనల షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. ఆ తరువాత అమెరి కా, ఇజ్రాయెల్‌, రష్యా, జర్మనీ, స్పెయిన్‌, కజికిస్తాన్‌ దేశాలలో పర్యటించను న్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్‌ ఖరారైంది. దాని వివరాల్లోకి వెళితే...


1) మే 12 నుంచీ 14 వరకు ప్రధాని శ్రీలంకలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ఐక్యరాజ్య సమితి వేసక్‌ దినోత్సవాలతో పాటు అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో కూడా పాల్గొననున్నారు.


2) జూన్‌ 1 నుంచీ 3 వరకు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మోడీ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.


3) జూన్‌ 7, 8 తేదీల్లో కజకిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశానికి చైనా ప్రధాన మిత్ర దేశమైన పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా హాజరు కానున్నట్టు సమాచారం.


4) జులై 7, 8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌లో జరగనున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు.5) అమెరికా, ఇజ్రాయెల్‌లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉంది.