కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 01:03 AM
 

    ఒంగోలు, మేజర్‌న్యూస్‌ : రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీరు ప్రగతి ఉద్యమాన్ని ప్రారంభిం చారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. గురువారం ప్రకాశం భవనం వద్ద నీరు - ప్రగతి ఉద్యమ స్పూర్తి ర్యాలీని రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రకాశం భవనం నుంచి నెల్లూరు బస్టాండ్‌ మీదగా రంగా భవన్‌ వరకు కొనసాగింది.


  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీరు ప్రగతి ఉద్యమ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి శిద్ధా జ్యోతి ప్రజ్యోన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం కార్యక్రమం చేపట్టా రన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చరిత్రలో నిలిచిపోతోం దన్నారు . 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రతీ సోమవారం ఇంజనీరింగ్‌ అధికారులతో సీఎం సమీక్షిస్తున్నారన్నారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం 2018 నాటికి మొదటి దశ పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ప్రాజెక్టు త్వరతిగతిన పూర్తి చేయడానికి టెన్నల్‌ పనులు వెనుక వైపు నుండి కూడా మొదలు పెడితే 2018 నాటికి పూర్తి చేయడానికి సిద్దపడుతుందని ఈ ప్రక్రియకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టడానికి సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. నీరు ప్రగతి కార్యక్రమాన్ని 90 రోజుల పాటు ఉద్యమ స్పూర్తితో చేపట్టడానికి అధికారులు, ప్రజలు సహక రించాలన్నారు. నీటి సంరక్షణ కోసం వాటర్‌ షెడ్‌ పనులు ఇంకుడు గుంతలు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి పనులు వేసవిలో 90 రోజుల పాటు చేపట్టా లన్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకుని భూగర్బ జలాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి నది నుంచి వెయ్యి టిఎంసీల నీటిని సముద్రంలోకి వృధాగా పోకుండా పట్టసీమ నిర్మించి  ప్రకాశం జిల్లాలకు సాగను నీటి అవసరాల కోసం 60 వేల ఎకరాలు సాగుకు నీరు అందించడం జరిగిందన్నారు. 


   ఈ సమావేశంలో పొల్గొన్న ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువును అరికట్టడానికి ప్రభుత్వం నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌, పేదరికం పై గెలుపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో అధికారులు ప్రజలు సహకా రంతో విజయవంతంగా 90 రోజులపాటు అమలు చేయాలన్నారు. వేసవిలో  డ్వామా, ఇరిగేషన్‌  శాఖ సంయుక్తంగా సాగు నీటి కుంటలు, చెక్‌డ్యాంములు పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు మాజీ శాసన సభ్యులు బీఎన్‌ విజయ కుమార్‌, ఇరిగేషన్‌ సీఈ వీర్రాజు, ఎస్‌ఇ శారద, డ్వామా పీడి పోలప్ప, డీఆర్‌ డీఏ ఏపి ఎంఎస్‌ మురళీ, వ్యవసాయ శాఖ జెడి మురళీ కృష్ణ, ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లు అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.