ఏపీ స్పేస్‌ అపిే్లకషన్స్‌ సెంటర్‌కు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించడం అన్యాయం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 01:01 AM
 

  విజయవాడ, సూర్య బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ 13 జిల్లాలకు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగస్ధులను అకారణంగా తొలగించడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ పార్టీ రాష్ర్ట మహిళ కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా, జనసేన పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యకర్త, అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం రాష్ర్ట కన్వీనర్‌, బిసి సంక్షేమ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్‌ లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ రెన్యూవల్‌, జీతాల విడుదలకు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గత 18 రోజులుగా వేసవి కాలంలో మండు టెండ లో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వీరిని పట్టించుకోక పోవడం చాలా దారుణమని ఇప్పటికైనా వీరి సేవలను గుర్తించి న్యాయం చేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలుగు వారిని అవమాన పరుస్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వీరి సమస్యలకు కారణమైన సంజయగుప్త (ఐఎఫ్‌ఎస్‌)ను వెంటనే తొలగించాలని అతనిపై చర్యలను తీసుకోవాలని డిమాండ్గ చేసారు. సమస్యలను 2, 3 రోజుల్లో పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి మేధావులు ఇలా రోడ్డున పడడం ప్రభుత్వాన్ని సిగ్గుచేటని, రాష్ర్టములో పనిచేస్తున్న  కాంట్రాక్టు, ఔట్‌ సోర్స్‌ ఉద్యోహులకు రక్షణ కరువైందని వాపోయారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని అలాంటి చర్యలు రాష్ర్ట ప్రభుత్వానికి రాష్ర్ట అభివద్ధికి మంచిదికాదని వీరి సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులను తొలగించి తెలుగువారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ  సంస్థను నమ్ముకుని గత 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించడం అన్యాయమని గత అయిదు నెలలుగా వీరు ఉద్యోగాలు లేక రోడ్డుపై పడినా  సంస్ధ యాజమాన్యం కానీ రాష్ట్ర ఫ్రభుత్వం స్పందించకపోవడం దారుణ మన్నారు. ఈ సంస్ధ సెక్రటరీ అయిన సంజయ్‌గుప్తా (ఐఎఫ్‌ఎస్‌) వీరిని దక్షిణ భారతీయులు అయినందున వీరిని తొలగించి ఆ స్థానంలో అధిక జీతాలుకు ఉత్తర భారతీయులను కూడా నియమించడం తెలుగువారికి చేస్తున్న తీవ్రమైన అన్యాయమని అన్నారు. హుదూద్‌ తుఫాన్‌ సమయంలో పదిహేను రోజుల పాటు 24 గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి నష్టాలు అంచనా వేయడం తోపాటు విశిష్ట సేవలు అందించిన విషయం, అట్లాగే ఈ కాంట్రాక్ట్‌ ఉద్యోగ స్థులు ద్వారానే అమలు చేయబడిన నీరుచెట్టు, వాటర్‌షెడ్గ, వాటర్‌గ్రిడ్గ, ఫైబర్‌గ్రిడ్గ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో సేవలందించినా మానవతాదృక్పధం కూడా సంస్ధ సెక్రటరీ అయిన సంజయ్‌గుప్తాకు లేకపోవడం విచారకరమన్నారు. ఇటువంటి ఉన్నత చదువులు చదివిన ఉద్యోగస్తులను అవమానపరుస్తూ తమ రాష్ర్టం వారిని ఉత్తేజపరుస్తూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తగదన్నారు. వెంటనే వీరిని ఉద్యోగాల్లోనికి తీసుకుని, ఐదు నెలల బకాయిలు చెల్లించాలని చెల్లించలేని పక్షంలో న్యాయం జరిగేంతవరకు ఎంతటి ఉద్యమా నై్ననా నిర్వహిస్తామని వారిని హెచ్చరిస్తూ తమ మద్దతును తెలిపారు. ఏపీ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎ.ఎమ్‌.రాజు మాట్లా డుతూ తమని ఉద్యోగాలనుంచి తొలగించి వేరొకరిని నియమించి మమ్మల్ని రోడ్డున వేయడం న్యాయమైంది కాదని ఇప్పటికైనా యాజమాన్యం మా 35 మందిని విధులలోకి తీసుకుని తమకి న్యాయం చేయాలని సంస్ధని కోరుతున్నా మన్నారు. రాష్ర్ట మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.టక్కర్‌ ఇచ్చిన (35 సంల కాంట్రాక్టు, పే స్కేల్‌) హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో సంస్ధ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆర్‌.కనకరాజు, ఎస్‌.అర్జున్‌, వి.శిరీష తదితర కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.