ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 12:55 AM
 

  అమరావతి, మేజర్‌న్యూస్‌ : ఎర్ర చందన స్మగ్లింగ్‌ రవాణా అరికట్టేందుక ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శా మంత్రి శిద్ధారాఘవరావు అటవీ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడిలోని తన కార్యాలయంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పికె సారంగితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విషయాలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎర్రచందనం నిల్వలు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,981 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయని ప్రన్సిపల్‌ ఛీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పికె సారంగి తెలియజేశారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ మరియు కన్వెన్షన్‌ ఆఫ్‌ ఇంటర్నషనల్‌ ట్రేడ్‌ ఆఫ్‌ ఎన్‌ డేంజర్డ్‌ స్పీషెస్‌ వారు 2,025 మెట్రిక్‌ టన్నుల అమ్మకానికి అంగీకారం తెలిపామన్నారు. ఈ అంగీకారం ఈనెల 30 తేదీన ముగియనుండటంతో అటవీ శాఖ ప్రన్సిపల్‌ సెక్రటరీ మరియు అధికారులు ఢిల్లీలో సంబంధింత అధికారులను ఈనెల 24వ తేఈదన కలిసి మరో 2 సంవత్సరాల పొడగింపుకు అను మతి కోరనున్నారని తెలిపారు.


    ఈ అనుమతి పొందిన వెంటనే 2,025 మెట్రిక్‌ టన్నుల అమ్మకానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. మిగిలిన 3,446  మెట్రిక్‌ టన్నుల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ కన్వెన్షన్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ ట్రేడ్‌ ఆఫ్‌ ఎన్‌ డేంజర్డ్‌ స్పీషెస్‌ వారు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. త్వరలోనే ఎర్ర చందనం నిల్వలున్న గిడ్డంగులను పరిశీలించడం జరుగుతోందన్నారు. ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ పూర్తిగా అరికట్ట డానికి సంబంధిత ప్రభుత్వ డిపార్ట్‌ మెంటులతో సంప్రదించి తగు ప్రణాళి కలను రూపొందించవల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎర్రచందన స్మగ్లింగ్‌ మరియు రవాణా పూర్తి స్ధాయిలో అరికట్టడానికి కావావల్సిన అదనపు సిబ్బంది ఏర్పాటుకు ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటా మన్నారు.