గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 12:52 AM
 

  విజయవాడ, సూర్య బ్యూరో :  రాష్ట్రంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన సంక్షేమ అధికా రులు, ఉప సంచాలకులు, గురుకులం అధికారులతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌.పి. సిసోడియా ఈ రోజు ప్రారంభించారు. ఈ రెండు రోజుల సమావేశం ఏప్రిల్‌ 20, 21వ తేదీలలో నగరంలో ఏర్పాటు చేసారు. ఈ సంవత్సర ఆరంభం నుండి వివిధ అభివృద్ధి కార్యక్ర మాలు ప్రణాళిక ప్రకారం అమలుచేయుటకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశిం చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేపడుతు న్నప్పటికి గ్రామాలకు రోడ్లు, నీటి సరఫరా, వైద్య, ఇతర మౌళిక సదుపాయాల కొరత ఉందని, దానిని అధిగమించుటకు ప్రణాళికలు రూపొం దించి అమలు చేయ్యాల్సిన బాధ్యాత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. జనాభా ప్రాతి పధికన రోడ్డు సౌకర్యం లేని గ్రామాలను ఎంపిక చేసి అవసరం మేరకు సిసి రోడ్లు, ప్రధాన రహదారిని కలిపే రోడ్లు, ఇతర రహదారులు సంతృప్త విధానంలో అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు కల్పిం చుటకు ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని ఆర్‌.పి. సిసోరియా ఆదేశించారు. అదే విధంగా గ్రామాలకు విద్యుద్ధీకరణ, నీటి సరఫరా, వైద్య సదుపాయం ఏర్పాటు, గిరిజనుల జీవనోపాధి సంబంధించిన పధకాలు, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు ఇతర మౌళిక సౌకర్యాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలు యుద ప్రాతిపదికన చేపట్టి అమలుచేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశించారు. అదే విధంగా గిరిజన ప్రాంతా లలో రక్తహీనత, మలేరియా వంటి ఆరోగ్య సమస్యలను నివారించటానికి తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ప్రతి అధికారి మంచి దృక్పధంతో, దీక్షతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తా యని ఆ దిశగా కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. ప్రతి గిరిజన కుటుం బం నెలకు కనీసం 10 వేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా కార్యక్ర మాల చేపట్టాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న అధికా రులు, సిబ్బంది అందరూ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రతి పాదిత పనులు అమలు చేయుటకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమీ షనర్‌ డా ఎం. పద్మ తెలిపారు. గిరిజన ప్రాంతా లలో భూ బదిలీ చట్టం (ఎల్‌.టి.ఆర్‌) అమలు చేయుట ద్వారా వారి భూమికి సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని, విద్య, ఉపాధి, మౌళిక సదుపా యాలు కల్పించుట, వైద్య సౌకర్యాలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని ఆమె తెలిపారు.  ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు, బి.వి. బాలయోగి, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారులు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొని 201718 సమగ్ర ప్రణాళిక రూపొం దించుటకు అవసరమైన సూచనలను చేసారు.