ఇళ్ల నిర్మాణంలో ఏపీ మూడో స్థానం : వెంకయ్య

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 20, 2017, 05:49 PM
 

న్యూఢిల్లీ :ఇళ్ల నిర్మాణంలో ఏపీ మూడో స్థానంలో నిలిచిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియాతో వెంకయ్య మాట్లాడుతూ… 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఏపీ నుంచి లక్షా 93వేల ఇళ్ల నిర్మాణానికి, తెలంగాణ నుంచి 8వేల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని ఆమోదించినట్లు వెంకయ్య చెప్పారు.