ఆరుగురు ప్రభుత్వ వైద్యుల సస్పెండ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 18, 2017, 12:06 AM
 

నెల్లూరు,సూర్యప్రతినిధి:  నెల్లూరు నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆరుగురు వెద్యులను వెద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నందుకు గాను మంత్రి వీరిని సస్పెండ్‌ చేశారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ప్రభుత్వ వెద్య కళాశాలను సందర్శించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ఆకస్మిక దాడులు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వెద్యులను దొంగలను పట్టుకున్నట్లు పట్టుకున్నారని ప్రభుత్వ డాక్టర్లు అయి ఉండి ఇలా చేయడం ఓ డాక్టర్‌గా తనకే అవమానంగా ఉందని అన్నారు. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదని ఇదే చివరిసారని సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న వెద్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. ఎవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అందరి వివరాలు తన వద్ద ఉన్నాయని, ఇక నుంచెనా జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. మంత్రి వెంట వెద్య కళాశాల ప్రిన్సిపల్‌ రవిపభ్రు, సూపరింటెండెంట్‌ రాధాకృష్ణరాజు, ఇతర వెద్యులు ఉన్నారు.