రిషికేష్ లోని శ్రీచంద్రమౌళీశ్వరస్వామి వార్షిక బ్రమోత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 19, 2017, 01:05 AM
 

తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : టిటిడికి అనుబంధ ంగా ఉన్న రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీచంద్ర మౌళీశ్వర స్వామి వారి ఆలయంలో మే నెల 21వ తేది నుంచి 25వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ వంగా జరుగనున్నాయి. మే 20వ తేది సాయం్త్రం అంకురార్పణ, మూషిక వాహనసేవ నిర్వహిస్తారు. మే 21వ తేది ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కాగా ఉదయం కల్పవృక్ష వాహనం, సాయం్త్రం హంస వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.


  మరుసటి రోజు 22వ తేది సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనం, సాయం్త్రం చంద్రప్రభ వాహనం, 23వ తేది ఉదయం శేషవాహనం, సాయం్త్రం గజవాహనం, 24వ తేది ఉదయం సింహవాహనం, సాయం్త్రం కల్యాణోత్సవం, వృషభవాహనం, 25వ తేది గురువారం ఉదయం త్రిశూలస్నానం, తిరుచ్చి వాహనం, సాయం్త్రం రావణాసుర వాహనం అనంతరం రాత్రి ధ్వజావరోహణం తో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్క ృ తిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.