అణగారిన వర్గాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 19, 2017, 12:58 AM
 

మేజర్‌న్యూస్‌, తిరుపతి : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 126వ జయంతి పురస్కరించుకొని తిరుపతి సిపిఐ పార్టీ కార్యాలయంలో అణగారిన వర్గాలు, ప్రభుత్వ పథకాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్‌) జిల్లా అధ్యక్షులు వి.లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయిసుధా మల్టీ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ బి.సుకుమార్‌ మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న దళిత హక్కుల పోరాట సమితి కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 126వ జయంతి సందర్భంగా అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించే దిశగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జె.వి.ప్రభాకర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బిజెపి, టిడిపిలు అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై, మైనార్టీలపై అధికంగా దాడులు జరుగుతున్నాయని, దీనిఐ దళిత వర్గాలు అప్రమత్తంగా ఉంటూ దళిత వర్గాలు ఐక్యంగా మెళుగుతూ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడాలన్నారు. స్వాతం్త్ర్యం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ దళితులను అణగారిన వర్గాలుగా చూడడమే కాకుండా ప్రభుత్వ పథకాలను దళితులకు చేరవేయడంలో, అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయిందన్నారు.సబ్‌ప్లాన్‌ నిధులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఖర్చు చేయడంలోను పూర్తిగా వైఫల్యం చెందాయని తీవ్రంగా విమర్శించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పెనుబాల చంద్రశేఖర్‌, ఎం.వి.ఎస్‌.మణి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, పి.వెంకటరత్నం, జె.రామచంద్రయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వి.లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగరాజన్‌, నగర సిపిఐ కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కత్తి రవి, శశికుమార్‌, శ్రీరాములు, నదియా, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి, నగర డిహెచ్‌పిఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగభూషణం, చిన్నం కాళయ్యలతోపాటు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్‌ చ్త్రిపటానికి రాష్ట్ర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.