పైలట్ అప్రమత్తతో విమానానికి తప్పిన పెనుముప్పు

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 06:29 PM
 

అమెరికా :  విమానం టేకాఫ్ అవుతుండగా రన్ వే పైకి వచ్చిన దుప్పిని ఢీకొన్న సంఘటన అమెరికాలోని చిర్లొట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు జరిగింది. 44 మంది ప్రయాణీకులతో ఉన్న ఆ విమానాన్ని పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం రెక్కలోంచి పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రయాణీకులందరినీ వెంటనే విమానం నుంచి దించేశారు.