ఫస్ట్‌ నుండి సెట్‌ పైకి ఎన్టీఆర్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 06:07 PM
 

దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల తరువాత మళ్లీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సెట్‌ మీదకు రావడానికి రెడీ అవుతున్నారు. జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ తరువాత సరైన డైరక్టర్‌ కానీ స్క్రిప్ట్‌ కానీ ఎన్టీఆర్‌ కు కుదరేలేదు. ఆఖరికి సర్దార్‌ డైరక్టర్‌ బాబీ ఓ మాంచి స్క్రిప్ట్‌ తేవడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రీ ప్రొడక్షన్‌ నుంచి ప్రొడక్షన్‌ వరకు వచ్చింది. 


నివేథా దామస్‌, రాశీఖన్నాలతో ఎన్టీఆర్‌ చేయబోయే ఈ సినిమాను బ్రదర్‌ కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తారు. ఈ సినిమా షూట్‌ ఈవారంలోనే ఫ్రారంభమవుతోంది. అయితే ఎన్టీఆర్‌ మాత్రం సెట్‌ మీదకు ఫస్ట్‌ నుంచి వస్తారు. అప్పటి నుంచి ఇక రెగ్యులర్‌ గా ఈ షూట్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటారు. ఈసినిమాకు సంబంధించి దాదాపు అన్నీ పూర్తయ్యాయి కానీ, మూడో హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. అయితే ఆ క్యారెక్టర్‌ ఫుల్‌ లెంగ్త్‌ కాదు కాబట్టి, ఎవరు సెట్‌ అవుతారా? అన్నదానిపై ఇంకా డెసిషన్‌ తీసుకోలేదు. కొంచెం టైమ్‌ తీసుకుని, ఆ టైమ్‌ కు ఎవరు సెట్‌ అయితే వాళ్లను తీసుకునే ఉద్దేశంతో వున్నారు.