జియో యూజర్లకు చేదువార్త

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 06:01 PM
 

ముంబై: టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ రిలయన్స్ జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. టెలికం మార్కెట్లోకి వ‌చ్చి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వినియోగ‌దారుల‌ను సంపాదించుకున్న రిల‌య‌న్స్ జియో సగటు 4జీ ఇంటర్నెట్‌ వేగం సగానికి పడిపోయిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) తెలిపింది. గతేడాది డిసెంబరులో 18.146 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో వేగం జనవరిలో 8.345 ఎంబీపీఎస్‌కు పడిపోయిందని పేర్కొంది.  మ‌రోవైపు 4జీ నెట్‌వర్క్‌లో అత్యధిక డేటా బదిలీ చేస్తున్న సంస్థగా ఎయిర్‌టెల్ తొలిస్థానంలో నిలిచింద‌ని పేర్కొంది.  ఎయిర్‌టెల్ 11.62 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచింది.  ఈ అంశంలో ఎయిర్‌టెల్ త‌రువాతి స్థానాల్లో ఐడియా, వొడాఫోన్‌ సంస్థలు ఉన్నాయి.  10.562 ఎంబీపీఎస్ వేగంతో ఐడియా, 10.301 ఎంబీపీఎస్‌లో వొడాఫోన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని  ట్రాయ్ వెల్లడించింది. 4జీ స్పీడులో డిసెంబరులో ఇతర నెట్‌వర్క్‌ల కంటే ముందున్న జియో జనవరిలో అకస్మాత్తుగా తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది.